- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాక్స్ ఓపెన్ చేయరావడం లేదు..ట్రంప్ యుద్దాలు ఆపుతాడా ?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump) తన పరువు తీసుకున్నాడు. ప్రపంచ దేశాలను వణికిస్తానని చెప్పే... డోనాల్డ్

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump) తన పరువు తీసుకున్నాడు. ప్రపంచ దేశాలను వణికిస్తానని చెప్పే... డోనాల్డ్ ట్రంప్... మీడియా ముందే.. పరువు గంగలో కలుపుకున్నాడు. ఓ చిన్న బాక్స్ ఓపెన్ చేయలేక నానా కష్టాలు పడ్డాడు డోనాల్డ్ ట్రంప్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వాషింగ్టన్ డిసి లో ( Washington DC ) తాజాగా అమెరికా ప్రభుత్వం కీలక ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా కొంత మందికి గోల్డ్ మెడల్స్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. వాటిని డోనాల్డ్ ట్రంప్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. వాటన్నిటిని బ్లాక్ బాక్సులలో పొందుపరిచారు అధికారులు. అయితే వాటిని ఓపెన్ చేసే ప్రయత్నంలో డోనాల్డ్ ట్రంప్.. చాలా ఇబ్బందులు పడ్డారు.
ఎంతకు ఓపెన్ చేసిన ఆ బాక్స్ ఓపెన్ కాలేదు. దీంతో అక్కడే ఉన్న ఓ అధికారిని పిలిచి ఆ బాక్స్.. ఓపెన్ చేయమని చెప్పాడు. దీంతో వెంటనే అధికారి చిటికలో ఓపెన్ చేశాడు. దీంతో అక్కడ ఉన్నవారు... నవ్వుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపిన డోనాల్డ్ ట్రంప్... ఆ చిన్న బాక్స్ ఓపెన్ చేయలేకపోయాడా? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.






