ఇరాన్‌కు అణ్వాయుధాలు ఇస్తారా..? రష్యాపై ట్రంప్ సీరియస్!

by Phanindra |

ఇరాన్‌కు చాలా దేశాలు అణ్వాయుధాలు ఇస్తాయని రష్యా మాజీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై డొనాల్డ్ ట్రంప్ సీరియస్ అయ్యారు.

ఇరాన్‌కు అణ్వాయుధాలు ఇస్తారా..? రష్యాపై ట్రంప్ సీరియస్!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల సమయంలో ఇరాన్‌కు అణుబాంబులు ఇచ్చేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయంటూ రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ చేసిన వ్యాఖ్యలపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సీరియస్ అయ్యారు. ఇలా అణ్వాయుధాల పేరు చెప్పి బెదిరించే ప్రయత్నం మానుకోవాలని సలహా ఇచ్చిన ట్రంప్.. యూఎస్‌ మిలిటరీని ఆధిపత్యాన్ని తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు. ‘రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ చాలా ఈజీగా ఎన్-వర్డ్ (న్యూక్లియర్ అనే పదం) ఉపయోగించారా? ఆయన, మిగతా దేశాలు కలిసి ఇరాన్‌కు న్యూక్లియర్ ఆయుధాలు అందిస్తాయని అన్నారా? నిజంగానే అన్నారా? లేదంటే ఇదంతా నా ఊహా?’ అంటూ ట్రంప్ వెటకారమాడారు.

న్యూక్లియర్ పదాన్ని అంత ఈజీగా వాడకూడదని, అందుకే ప్రస్తుతం రష్యాలో పుతిన్ ‘బాస్’ అని ట్రంప్ అన్నారు. అదే సమయంలో ఇరాన్‌పై యూఎస్ చేసిన దాడులను మెచ్చుకున్న ఆయన.. ఈ దాడుల్లో యూఎస్ మొత్తం 30 తోమహాక్స్ లాంచ్ చేయగా, అన్నీ టార్గెట్‌ను ఛేదించాయని చెప్పారు. అయితే ఇది యూఎస్ మిలిటరీ పూర్తి సామర్థ్యం కాదని, తమ న్యూక్లియర్ సబ్‌మెరీన్లు అత్యంత శక్తిమంతమైనవని చెప్పారు. అణ్వాయుధ శక్తిలో వీటి సామర్థ్యాన్ని అందుకోవడానికి ప్రపంచ దేశాలకు కనీసం 20 ఏళ్లు పడుతుందని పేర్కొన్నారు.

Next Story