- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంత త్వరగా చల్లబడితే అంత మంచిది..భారత్-పాక్ పరిస్థితిపై యూఎస్
by Phanindra |
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణంపై యూఎస్ స్పందించింది. పరిస్థితి ఎంత త్వరగా చల్లబడితే అంతమంచిదని ట్రంప్ భావిస్తున్నారట.

X
దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ‘ఈ రెండు దేశాల మధ్య ఎప్పటి నుంచో పరిస్థితులు బాగలేవనే విషయాన్ని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అర్థం చేసుకున్నారు. అయితే ఇరుదేశాల నేతలతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. కాబట్టి పరిస్థితి ఎంత త్వరగా చల్లబడితే అంత మంచిదని ఆయన భావిస్తున్నారు’ అని యూఎస్ అధికార ప్రతినిధి కరోలైన్ లీవిట్ తెలిపారు.
ఈ రెండు దేశాల నేతలతో సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రుబియో చర్చలు జరుపుతూనే ఉన్నారని, సాధ్యమైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె చెప్పారు. కాగా, భారత్-పాక్ మధ్య యుద్ధ పరిస్థితుల్లో నేరుగా యూఎస్ తలదూర్చబోదని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Next Story






