- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌లో ఐఫోన్లు తయారుచేస్తే 25 శాతం పన్ను.. ఆపిల్ కంపెనీకి ట్రంప్ వార్నింగ్
భారత్‌లో ఐఫోన్లు తయారుచేస్తే 25 శాతం పన్ను కట్టాల్సి ఉంటుందని, ఆపిల్ కంపెనీకి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లో ఐఫోన్లు తయారు చేయడంపై ఆపిల్ కంపెనీకి యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. యూఎస్‌లో అమ్మే ఐఫోన్లన్నీ అమెరికాలోనే తయారు చేయాలని, భారత్‌లోనో ఇంకే దేశంలోనైనా తయారు చేసిన ఐఫోన్లు యూఎస్‌లో అమ్మితే అదనంగా 25 శాతం సుంకాలు వేస్తానని ట్రంప్ హెచ్చరించాడు. ఈ ప్రకటన తర్వాత ఆపిల్ కంపెనీ షేర్ల విలువ 2.5 శాతం తగ్గింది.
‘యూఎస్‌లో అమ్మే ఐఫోన్లన్నీ అమెరికాలోనే తయారవ్వాలని చాలారోజుల క్రితమే ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌కు చెప్పా. ఇండియాలోనో లేదంటే ఇంకే దేశంలోనో తయారు చేసి ఇక్కడ అమ్మితే ఊరుకునేది లేదని కూడా స్పష్టం చేశా. అలా చేస్తే యూఎస్ ప్రభుత్వానికి ఆపిల్ కనీసం 25 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్టు చేశారు.
అయితే ఒక కంపెనీపై ఇలా సుంకాలు విధించవచ్చా? అనే అంశంపై అనుమానాలున్నాయి. చైనాపై అమెరికా సుంకాల నేపథ్యంలో భారత్‌ను తమ మ్యానుఫాక్చరింగ్ బేస్‌గా మార్చుకోవాలని ఆపిల్ భావిస్తున్న సంగతి తెలిసిందే.






