విదేశీ ఉద్యోగుల విషయంలో ట్రంప్ యూటర్న్

by Phanindra |

విదేశీ ఉద్యోగుల విషయంలో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. విదేశీ కంపెనీలు తమ ఉద్యోగులను తీసుకొచ్చుకోవచ్చని, ఇది అత్యవసరమని చెప్పారు.

విదేశీ ఉద్యోగుల విషయంలో ట్రంప్ యూటర్న్
X

దిశ, నేషనల్ బ్యూరో: విదేశీ ఉద్యోగుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. యూఎస్‌లో విదేశీ ఉద్యోగుల అవసరాన్ని ఆయన సమర్థించారు. ఇటీవల జార్జియాలోని హ్యుండాయ్ బ్యాటరీ ప్లాంట్‌పై ఇమిగ్రేషన్ అధికారులు రెయిడ్ చేసి సుమారు 475 మంది దక్షిణ కొరియా వాసులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ చర్యలపై మండిపడిన సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్.. అమెరికాలో తమ కంపెనీలు నేరుగా పెట్టే పెట్టుబడులను వెనక్కు తీసుకుంటామని హెచ్చరించారు.

దీంతో తన విధానం మార్చుకున్న ట్రంప్.. ఆధునిక ఉత్పత్తి రంగాల్లో విదేశీ నైపుణ్యాలు ఎంతో అవసరం అంటూ తన ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. సంక్లిష్టమైన పరిశ్రమల్లో అమెరికన్లకు శిక్షణ ఇవ్వాలంటే.. నైపుణ్యం ఉన్న ఉద్యోగులను తెచ్చుకునే వెసులుబాటును విదేశీ కంపెనీలకు ఇవ్వడం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.

Next Story