ఇరాన్ అధినాయకత్వం మార్పుపై యూటర్న్ తీసుకున్న ట్రంప్!

by Phanindra |

ఇరాన్ అధినాయకత్వం మారాల్సిన అవసరం లేదని ట్రంప్ అన్నారు. కొన్నిరోజుల క్రితం ఇదే జరగాలని ఆయన చెప్పిన విషయం తెలిసిందే.

ఇరాన్ అధినాయకత్వం మార్పుపై యూటర్న్ తీసుకున్న ట్రంప్!
X

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి యూటర్న్ తీసుకున్నారు. నిన్నమొన్నటి వరకు ఇరాన్‌లో ప్రభుత్వాన్ని మారుస్తామని చెప్పిన ఆయన.. ఇప్పుడు సడెన్‌గా ఇరాన్‌లో ప్రభుత్వం మారాల్సిన అవసరం లేదన్నారు. నెదర్లాండ్స్‌లో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సమావేశానికి బయల్దేరే ముందు తన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడారు ట్రంప్. ఈ సమయంలో ఇరాన్‌లో అధికారం మార్పు అవసరమని అనుకుంటున్నారా? అని ప్రశ్నించగా.. ‘లేదు. జరిగితే జరుగుతుంది లేదంటే లేదు. నాకైతే అక్కర్లేదు’ అని ట్రంప్ బదులిచ్చారు.


‘అధినాయకత్వం మారితే అల్లకల్లోలం జరుగుతుంది. మేం అలాంటి పరిస్థితిని చూడాలని అనుకోవడం లేదు. అసలు ‘రెజీమ్ ఛేంజ్’ (అధినాయకత్వం మార్పు) అనే పదాన్ని ఉపయోగించడమే రాజకీయంగా తప్పు. కానీ ప్రస్తుతం ఉన్న నాయకత్వం ఇరాన్‌ను గొప్పగా మార్చలేకపోతే.. ఆ నాయకత్వం ఎందుకు మారదు?’ అని ఆయన అడిగారు. అయితే ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులు చేసిన తర్వాత ఇరాన్‌ అధినాయకత్వం మార్పునకు ట్రంప్ మద్దతిచ్చిన సంగతి తెలిసిందే.

Next Story