- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను మధ్యవర్తిత్వం చేసినట్టు చెప్పుకోవట్లే...ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
భారత్ పాకిస్థాన్ కొట్టుకోవడం తనకు ఇష్టం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను మధ్యవర్తిత్వం చేసినట్టు చెప్పుకోవడంలేదని కానీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించానని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: భారత్ పాకిస్థాన్ కొట్టుకోవడం తనకు ఇష్టం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను మధ్యవర్తిత్వం చేసినట్టు చెప్పుకోవడంలేదని కానీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించానని చెప్పారు. రెండు దేశాలు యుద్దం బదులు వాణిజ్యం పై దృష్టి పెట్టాలని ట్రంప్ సూచించారు. అణ్వాయుధాలు కలిగిన రెండు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తత తగ్గించడంలో పరోక్ష పాత్ర పోశించానని అన్నారు. పెరుగుతున్న శత్రుత్వం క్షిపణి దాడులకు దారి తీయవచ్చని హెచ్చరించారు. ప్రస్తుతం పరిస్థితి కుదుటపడిందని చెప్పారు. ఉద్రిక్తత తగ్గడంతో పాకిస్థాన్, భారత్ సంతోషంగా ఉన్నాయని అన్నారు.
రెండు దేశాల మధ్య ధీర్ఘకాలంగా శత్రుత్వాలు ఉన్నాయని వారు దాదాపు వెయ్యి సంవత్సరాలుగా పోరాడుతున్నారని వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య తాను సమస్యని పరిష్కరించగలనని, రెండు దేశాలను కలపాలని అన్నారు. కానీ రెండు దేశాల మధ్య సమస్యను పరిష్కరిస్తానో లేదో ఖచ్చితంగా చెప్పలేనని అన్నారు. ఎందుకంటే అది కఠినమైనది అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఇండియా పాక్ మధ్య యుద్ద విరమణలో ట్రంప్ ప్రమేయం ఉందని అమెరికా ప్రకటించుకుంది. ట్రంప్ కూడా తన ట్వీట్ లో అదే చెప్పుకున్నారు. దీంతో ఇండియా ట్రంప్ ప్రకటనను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ నేడు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.






