మళ్లీ యూఎస్-చైనా ట్రేడ్ వార్?.. ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిందన్న ట్రంప్

by Phanindra |

మళ్లీ యూఎస్-చైనా ట్రేడ్ వార్ జరిగేలా ఉంది. తమతో చేసుకున్న ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిందని ట్రంప్ చెప్పారు.

మళ్లీ యూఎస్-చైనా ట్రేడ్ వార్?.. ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిందన్న ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనా-యూఎస్ మధ్య మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేచిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కొన్నిరోజుల క్రితం ఈ రెండు దేశాలు ఒకదానిపై మరొకటి భారీ స్థాయిలో సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ టారిఫ్‌లను 90 రోజులపాటు నిలిపివేస్తున్నామని, ఈ సమయంలో చర్చలు జరిపి సుంకాలపై నిర్ణయం తీసుకుంటామని ఇరుదేశాలు ప్రకటించాయి. ఇలాంటి సమయంలో తాజాగా ట్రంప్ షాకింగ్ విషయం వెల్లడించారు. ‘యూఎస్‌తో చేసుకున్న ఒప్పందాన్ని చాలామంది అనుకున్నట్లే చైనా పూర్తిగా ఉల్లంఘించింది’ అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు ట్రంప్.


అయితే చైనా ఏం చేసిందనే వివరణ మాత్రం ఇవ్వలేదు. యూఎస్‌కు ఎగుమతి చేయాల్సిన కీలకమైన మినరల్స్‌ను చైనా తగ్గించిందని, ఇదే ట్రంప్ ఆగ్రహానికి కారణమని కొందరు నిపుణులు చెప్తున్నారు. దీంతో మరోసారి ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ తప్పదని అంచనా వేస్తున్నారు.

Next Story