ప్రపంచాన్ని బందీ చేసే ప్లాన్.. చైనాపై ట్రంప్ ఆగ్రహం

by Phanindra |

ప్రపంచాన్ని బందీ చేసేందుకు చైనా ప్లాన్ చేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

ప్రపంచాన్ని బందీ చేసే ప్లాన్.. చైనాపై ట్రంప్ ఆగ్రహం
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మండిపడ్డారు. అరుదైన ఖనిజాల ఎగుమతులు చూపించి, ప్రపంచాన్ని బందీలుగా చేసేందుకు చైనా ప్రయత్నిస్తోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చైనా పద్ధతి మారకుంటే జిన్‌పింగ్‌తో భేటీని రద్దు చేసుకుంటానని బెదిరించారు. ఆర్థికంగా గుత్తాధిపత్యం సాధించేందుకు డ్రాగన్ కంట్రీ కుట్రలు పన్నుతోందన్నారు. ‘ప్రపంచాన్ని బందీగా చేసే అవకాశం చైనాకు దొరకదు. అయితే చాలాకాలంగా వాళ్ల ప్లాన్ మాత్రం అదే అనిపిస్తోంది’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు.

అరుదైన ఖనిజాలతోపాటు తమకు అందుబాటులో ఉన్న ప్రతి వస్తువు ఎగుమతులను కంట్రోల్ చేసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, ఇలా చేసేందుకు ప్రపంచ దేశాలకు లేఖలు రాస్తోందని ట్రంప్ ఆరోపించారు. చైనాలో ఉత్పత్తి అవ్వని వస్తువులు కూడా ఆయా దేశాల నుంచి పూర్తిగా ఎగుమతి అవ్వకుండా అడ్డుకుంటోందని మండిపడ్డారు. చైనా విధానాల వల్ల ప్రపంచ మార్కెట్లు స్తంభించిపోయి, అన్నిదేశాలకూ ఇబ్బందులు సృష్టిస్తాయని హెచ్చరించారు. చైనా ఇలా ఉన్నట్టుండి అందరికీ శత్రువుగా ఎందుకు మారిందో తెలియదని, ఇది తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందని ఆయన అన్నారు.

Next Story