- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలా చేస్తే తక్కువ టారిఫ్స్.. భారత్-యూఎస్ ట్రేడ్ డీల్‌పై ట్రంప్ కామెంట్స్!
by Phanindra |
భారత్-యూఎస్ ట్రేడ్ డీల్‌పై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక కామెంట్స్ చేశారు. భారత్ ఒక పనిచేస్తే చాలా తక్కువ టారిఫ్స్‌తో డీల్ ఉంటుందన్నారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: త్వరలోనే భారత్-యూఎస్ మధ్య చాలా తక్కువ టారిఫ్స్‌తో ట్రేడ్ డీల్ జరుగుతుందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘భారత్‌తో మంచి డీల్ జరుగుతుందని అనుకుంటున్నా. ఇది చాలా డిఫరెంట్‌గా ఉండబోతోంది. దీంతో మేం భారత్‌కు వెళ్లి పోటీ పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇతరులను తమ దేశంలోకి భారత్ రానివ్వడంలేదు. ఇండియా కనుక ఈ నిర్ణయం తీసుకుంటే.. చాలా తక్కువ సుంకాలతో డీల్ చేసుకుంటాం’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఈ రెండు దేశాలు సుంకాలు పెంచకుండా 90 రోజుల గడువు పెట్టుకున్నాయి. ఈ గడువు జులై 9న ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే ట్రేడ్ డీలో కోసం రెండు దేశాల బృందాలు చర్చలు తీవ్రతరం చేశాయి. చీఫ్ నెగోషియేటర్ రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని భారత డిలిగేషన్ ఇటీవలే వాషింగ్టన్‌లో తమ స్టేను ఎక్స్‌టెండ్ చేసుకున్న సంగతి తెలిసిందే.
Next Story






