రష్యా టార్గెట్‌గా న్యూక్లియర్ సబ్‌మెరైన్స్ నిలబెట్టా: ట్రంప్

by Phanindra |

రష్యా టార్గెట్‌గా న్యూక్లియర్ సబ్‌మెరైన్స్ నిలబెట్టానని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ట్రూత్ సోషల్‌లో వెల్లడించారు.

రష్యా టార్గెట్‌గా న్యూక్లియర్ సబ్‌మెరైన్స్ నిలబెట్టా: ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలపై యూఎస్ ప్రెసిడెండ్ డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే యూఎస్‌కు చెందిన రెండు న్యూక్లియర్ సబ్‌మెరైన్స్‌ను డిప్లాయ్ చేయడానికి అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు. ‘రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలను చూసిన తర్వాత.. రెండు న్యూక్లియర్ సబ్‌మెరైన్స్‌ను కీలకమైన ప్రాంతాల్లో నిలబెట్టాలని ఆర్డర్స్ ఇచ్చాను.

ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కేవలం మాటలేనా? లేక అంతకన్నా ఏమైనా ఉందా? అనే అనుమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో పోస్టు చేశారు. అలాగే మనం మాట్లాడే మాటలు చాలా ముఖ్యమని, ఒక్కోసారి సరదాగా చేసిన వ్యాఖ్యలు ఊహించని పరిణామాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఇది అలాంటి సందర్భం కాకూడదని ఆశిస్తున్నట్లు చెప్పారు.

అయితే మెద్వెదేవ్ చేసిన ఏ వ్యాఖ్యల వల్ల ట్రంప్ ఇలా స్పందించారో మాత్రం చెప్పలేదు. కాగా, ఇటీవల తన టెలిగ్రాం ఛానెల్‌లో ట్రంప్‌పై మెద్వెదేవ్ తీవ్రవిమర్శలు చేశారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని యూఎస్ చేస్తున్న హెచ్చరికలను తప్పుబట్టిన ఆయన.. తమ వద్ద సోవియట్ యూనియన్ నాటి న్యూక్లియర్ సామర్ధ్యాలు ఉన్నాయని పరోక్షంగా హెచ్చరించారు.

ఈ క్రమంలోనే న్యూక్లియర్ సబ్‌మెరైన్స్‌ను డిప్లాయ్ చేశామన్న ట్రంప్.. ఇవి కేవలం అణు సామర్ధ్యం ఉన్న జలాంతర్గాములా? లేక వీటిలో న్యూక్లియర్ బాంబులు ఉన్నాయా? అనే అంశంపై కూడా స్పష్టత ఇవ్వలేదు.

Next Story