Donald Trump: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రెసిడెంట్ ట్రంప్.. టెస్లా కారు కొనుగోలు

by Kema Shiva Kumar |

దేశ వ్యాప్తంగా ఎలాన్ మస్క్‌ (Elon Mask)కు చెందిన టెస్లా (Tesla) కార్లను బహిష్కరించాలని నిరసనలు వెల్లవెత్తుతోన్న తరుణంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురి చేసింది.

Donald Trump: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రెసిడెంట్ ట్రంప్.. టెస్లా కారు కొనుగోలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఎలాన్ మస్క్‌ (Elon Mask)కు చెందిన టెస్లా (Tesla) కార్లను బహిష్కరించాలని నిరసనలు వెల్లవెత్తుతోన్న తరుణంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురి చేసింది. మస్క్ బిజినెస్‌కు దన్నుగా నిలిచేందుకు ఇచ్చిన మాట మేరకు ఆయన మంగళవారం ఆయన టెస్లా (Tesla) ఎరుపు రంగు సెడాన్ ఎలక్ట్రిక్ కారు (Electric Car)ను కొనుగోలు చేశారు. దాని ధర అక్షరాల 80 వేల డాలర్లు. అయితే, నేరుగా కారును ఎలాన్ మస్క్ వైట్‌హౌజ్ (White House) ఎదుట పార్క్ చేసి ఇంటీరియర్ (Interior) గురించి మొత్తం ట్రంప్‌కు వివరించారు.

అనంతరం ప్రెసిడెంట్ కాసేపు సరదాగా కారు నడిపారు. అనంతరం డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మాట్లాడుతూ.. తనకు ఎరుపు రంగులో ఉన్న ఆ కారు తనకు చాలా నచ్చిందని కితాబిచ్చారు. కారు పూర్తిగా ‘బుల్లెట్ ప్రూఫ్’ (Bullet Proof) అని ఎలాన్ మస్క్ (Elon Mask) సమాధానమిచ్చాడు. అనంతరం 30 నిమిషాల పాటు జరగిన ట్రంప్, మస్క్ భేటీలో ఎలక్ట్రికల్ కార్ల బిజినెస్ (Electric Car Business), స్టాక్ మార్కెట్ (Stock Market), కెనడియన్ టారీఫ్ (Canadian Tariff), ఉక్రెయిన్ వార్ (Ukraine War) గురించి ప్రధానంగా చర్చించారు. అయితే, ప్రెసిడెంట్ ట్రంప్ టెస్లా కారుతో ఫోజులిచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story