- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ ఇద్దరు సామాన్యులు కాదు: భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ మళ్లీ కామెంట్స్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ వ్యవహారంపై స్పందిస్తూనే, భారత్-పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను ప్రస్తావించి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లు 'అత్యంత సమర్థులు, అసాధారణ వ్యక్తులు' అని ట్రంప్ అభివర్ణించారు. వారిద్దరితో జరిగిన సమావేశం అనంతరం తాను ఈ అభిప్రాయానికి వచ్చినట్లు తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో పేర్కొన్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన ఒక భయంకరమైన యుద్ధాన్ని తాను ఆపడం ద్వారా దాదాపు 3 నుంచి 5 కోట్ల మంది ప్రాణాలను కాపాడానని ట్రంప్ పునరుద్ఘాటించారు. "నేను చేసిన సహాయానికి వారు (పాక్ నేతలు) నాకు నిరంతరం కృతజ్ఞతలు తెలుపుతూనే ఉన్నారు" అని ఆయన రాసుకొచ్చారు.
ఇరాన్‌కు హెచ్చరిక...
హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్, ఇరాన్ చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొందని మండిపడ్డారు. దాదాపు 20 గంటల పాటు జరిగిన చర్చల సారాంశం ప్రకారం.. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని సాధించలేదని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ పదే పదే ఈ యుద్ధ నివారణ వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ, భారత్ మాత్రం దీనిని మొదటి నుంచీ తోసిపుచ్చుతోంది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడానికి అమెరికా మధ్యవర్తిత్వం కారణం కాదని, అది కేవలం రెండు దేశాల సైన్యాల మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితమేనని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గతంలోనే స్పష్టం చేశారు. 'ఆపరేషన్ సింధూర్' తర్వాత పాక్ సైన్యమే చర్చలకు చొరవ చూపిందని భారత ప్రభుత్వం చెబుతోంది.






