నోబెల్ ఇవ్వలేదనే గ్రీన్‌లాండ్‌ గొడవ.. కడుపు మంట బయటపెట్టిన ట్రంప్

by Phanindra |

నోబెల్ ఇవ్వలేదనే గ్రీన్‌లాండ్‌ గొడవ పెట్టుకున్నట్లు ఎట్టకేలకు ట్రంప్ ఒప్పేసుకున్నారు. కడుపు మంట బయటపెట్టుకున్నారు.

నోబెల్ ఇవ్వలేదనే గ్రీన్‌లాండ్‌ గొడవ.. కడుపు మంట బయటపెట్టిన ట్రంప్
X

దిశ, నేసనల్ బ్యూరో: గ్రీన్‌లాండ్ కోసం అంతర్జాతీయంగా నానా రాద్ధాంతం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇదంతా తనకు నోబెల్ దక్కలేదనే అక్కసుతోనే చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్‌కు రాసిన లేఖతో ఈ విషయం తేటతెల్లమైంది. ‘ప్రపంచ వ్యాప్తంగా 8 యుద్ధాలు ఆపినా కూడా.. నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకూడదని మీ ప్రభుత్వం డిసైడ్ చేసింది. దాంతో ఇక శాంతి కోసమే ఆలోచించకూడదని, అది అనవసరమని నిర్ణయించుకున్నా. ఇప్పటికీ నాకు శాంతి ముఖ్యమే. కానీ ముందు అమెరికాకు ఎది మంచిదో, ముఖ్యమో అదే చేయడంపై ఫోకస్ పెడతా’ అని తన లేఖలో ట్రంప్ రాసుకొచ్చారు. ఈ కారణం చూపిస్తూ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడాన్ని ట్రంప్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

‘గ్రీన్‌లాండ్‌ను రష్యా, చైనా నుంచి డెన్మార్క్ కాపాడలేదు. అలాంటప్పుడు వాళ్లకు యాజమాన్య హక్కు ఎలా ఉంటుంది? వందల ఏళ్ల క్రితం అక్కడ వాళ్ల పడవ ఒకటి ల్యాండ్ అయితే సరిపోతుందా? అక్కడేం రాసుకున్న కాగితాలు లేవు కదా. గ్రీన్‌లాండ్‌లో మా ఓడలు కూడా ఆగుతున్నాయిగా’ అని ట్రంప్ తన లేఖలో పేర్కొన్నారు. నోబెల్ శాంతి బహుమతి ప్రకటనలో నార్వే ప్రభుత్వం జోక్యం ఏమాత్రం ఉండదు. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం గతంలోనే స్పష్టంచేసింది. ఇప్పుడు ట్రంప్ ఇలా లేఖ రాసిన విషయాన్ని కూడా నార్వే ప్రధాని ధ్రువీకరించినట్లు సమాచారం. అంతుముందు గ్రీన్‌లాండ్ ఆక్రమణను వ్యతిరేకించినందుకు తమపై సుంకాలు వేయాడాన్ని విమర్శిస్తూ ట్రంప్‌కు తను, ఫిన్‌లాండ్ ప్రధాని అలెగ్జాండర్ స్టబ్ లేఖలు రాశామని.. దీనికి బదులుగానే ట్రంప్ తమకు ఇలా లెటర్స్ పంపారని పీఎం స్టోర్ వెల్లడించారు. ఇలాంటి లేఖలే పలు యూరప్ దేశాల రాయబారులకు కూడా ట్రంప్ ప్రభుత్వం పంపినట్లు తెలుస్తోంది.

Next Story