కెరీర్ తొలినాళ్లలో డొనాల్డ్ ట్రంప్ ఏం చేసేవాడో తెలుసా?

by Gantepaka Srikanth |
కెరీర్ తొలినాళ్లలో డొనాల్డ్ ట్రంప్ ఏం చేసేవాడో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్రరాజ్యమైన అమెరికాకు రిపబ్లికన్ పార్టీ(Republican Party) నేత డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. భాతర కాలమనం ప్రకారం ఈ రాత్రే 10:30 గంటలకు ప్రమాణస్వీకారం చేబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నారు. 1946 జూన్ 14న న్యూయార్క్ సిటీ(New York City)లో మేరీ అన్నే మాక్లియోడ్, ఫ్రెడ్ ట్రంప్ జూనియర్‌లకు ట్రంప్ జన్మించారు. న్యూయార్క్ మిలిటరీ అకాడమీలో హైస్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేశారు.

1964లో ఫోర్ట్‌హామ్ యూనివర్సిటీ(Fortham University)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1968లో యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలోని వార్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అండ్‌ కామర్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. ట్రంప్ తండ్రి ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి(Real estate trader). దీంతో ట్రంప్ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంతోనే కెరీర్ మొదలు పెట్టారు. అంతేకాదు.. కెరీర్ తొలినాళ్లలో హోటల్స్, మోడలింగ్, స్పోర్ట్స్, రేస్‌క్లబ్‌లు నిర్వహించేవారు. 1983లో న్యూయార్క్‌ ట్రంప్ టవర్ నిర్మించారు. టీవీ, సినీ రంగాల్లోనూ రాణించారు.

1987లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2012 తర్వాత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. 2017 తొలిసారిగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. తిరిగి 2024లో మరోసారి గెలిచారు. ఇదిలా ఉండగా.. మొన్నటి ఫలితాల అనంతరం ట్రంప్‌ పలు కీలక ప్రకటనలు చేశారు. కెనడాను 51వ రాష్ట్రంగా చేయడం, గ్రీన్‌ల్యాండ్‌, పనామాలను స్వాధీనం చేసుకోవడం, గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోను గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికాగా మార్చడం వంటి ప్రకటనలు చేశారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే కీలక ఆదేశాలపై సంతకాలు చేస్తానని ప్రకటించారు. ముఖ్యంగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద డిపార్టేషన్‌ ఆపరేషన్‌ చేపడతామని చెప్పారు.

Advertisement

Next Story