Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-20 17:16:10.0  )
Donald Trump :  అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా 47వ అధ్యక్షుడి(US President)గా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రమాణం చేశారు. బరాక్ ఒబామా, మాజీ అధ్యక్షుడు జో బైడెన్ సమక్షంలో ప్రమాణం చేశారు. ఈ మహా ఘట్టానికి ప్రపంచ దేశాల నుంచి అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. భారత్ నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్(Minister Jaishankar) హాజరయ్యారు. 78 ఏళ్ల వయసులో అగ్రరాజ్యాధినేతగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్‌తో పాటు ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ కూడా ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్‌లోని రోటుండా ఇండోర్‌లో 25 వేల మంది భారీ భద్రత మధ్య ప్రమాణం చేశారు.

కాగా, డొనాల్డ్ ట్రంప్ 1946 జూన్ 14న న్యూయార్క్‌లో జన్మించారు. ఈయన తండ్రి ఫ్రెడ్ జూనియర్ ట్రంప్ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి. 1971లో తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని ట్రంప్ స్వీకరించారు. 1987లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2012 తర్వాత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. 2017 తొలిసారిగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. తిరిగి 2024లో మరోసారి గెలిచారు. ఈ ప్రమాణస్వీకారానికి హాజరైన వారిలో ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ దంపతులు కూడా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed