- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టూడెంట్ లోన్స్‌పై పరిమితి విధించే యోచనలో ట్రంప్ సర్కారు!
స్టూడెంట్ లోన్స్‌పై పరిమితి విధించే యోచనలో ట్రంప్ సర్కారు. వచ్చే ఏడాది నుంచి పలు కోర్సుల స్టూడెంట్ లోన్స్‌పై భారీగా క్యాప్స్.

దిశ, నేషనల్ బ్యూరో: వలసదారులు, విదేశీ విద్యార్థులపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. విద్యార్థులు చదువుకునేందుకు తీసుకునే స్టూడెంట్ లోన్లపై పరిమితులు విధించేందుకు రెడీ అవుతోంది. యూఎస్‌కు డిగ్రీల కోసం వచ్చే విదేశీ విద్యార్థులు బడా కోర్సులు చదివే సమయంలో స్టూడెంట్ లోన్స్ చాలా ఉపయోగపడతాయి. అయితే ఇకపై ఇలా స్టూడెంట్ లోన్స్ డబ్బుతోనే కోర్సులు పూర్తిచేయకుండా అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే స్టూడెంట్ లోన్స్‌పై వచ్చే ఏడాది జులై 1 నుంచి పరిమితి విధించేందుకు యూఎస్ సిద్ధమవుతోంది. ఈ పరిమితులును యూఎస్ విద్యార్థులకు కూడా వర్తించే అవకాశం ఉంది. ఏ కోర్సులకు ఎంత స్టూడెంట్ లోన్స్ ఇవ్వాలో? ఏ కోర్సులు అత్యధిక లోన్స్ పొందగలవో పరిమితులు విధించనున్నారు. అయితే ఈ కొత్త విధానం ప్రభావం అండర్‌గ్రాడ్యుయేట్లపై పడదని సమాచారం. డిపెండెంట్ అండర్‌గ్రాడ్యుయేట్లు ఎప్పట్లాగే ఏటా 7,500 డాలర్ల లోన్ పొందుతారు. అయితే గ్రాడ్యుయేట్, ప్రొఫెషనల్ కోర్సులనే కొత్త విధానంలో ట్రంప్ ప్రభుత్వం టార్గెట్ చేయనుంది.
కొత్త విధానంలో గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఏటా 20,500 డాలర్లు లోన్ తీసుకోవచ్చు. మొత్తంగా గ్రాడ్యుయేషన్‌లో లక్ష డాలర్ల వరకు లోన్ పొందేవారు. ప్రొఫెషనల్ కోర్సుల్లో చదివేవారు ఏటా 50 వేల డాలర్లు, మొత్తం 2 లక్షల డాలర్ల వరకు లోన్ పొందగలిగేవారు. ఇంతకాలం కోర్సు పూర్తి ఖర్చును లోన్ ద్వారా పొందే అవకాశం ఉండేది. ఇలాంటి విధానాలను ట్రంప్ సర్కారు రద్దు చేయనుందని సమాచారం. అయితే ఏ కోర్సును ప్రొఫెషనల్ కోర్సుగా పరిగణించాలనే అంశంపై పూర్తి స్పష్టత లేదు.
అలాగే ఫార్మసీ, డెంటిస్ట్రీ, వెటెరినరీ మెడిసిన్, కైరోప్రాక్టిక్, లా, మెడిసిన్, ఆప్టొమెట్రీ, ఓస్టియోపాథిక్ మెడిసిన్, పోడియాట్రీ, థియాలజీ, క్లినికల్ సైకాలజీ కోర్సులు చదివే విద్యా్ర్థులు ఆటోమేటిక్‌గా అధికలోన్లు పొందగలరని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పేర్కొంది. అయితే మిగతా ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులు దీనిపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదన ఫైనల్ కాదని, ప్రస్తుతం చర్చలకే పరిమితమైన ఈ చట్టాన్ని త్వరలోనే ఫెడరల్ రిజిస్టర్‌లో ఉంచుతామని, వీటిపై ప్రజలు తమ అభ్యంతరాలను తెలపవచ్చని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలిపింది.






