- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
37 ఏళ్ల మహిళను కాల్చి చంపిన అధికారులు..సమర్థించిన ట్రంప్
by Phanindra |
37 ఏళ్ల మహిళను యూఎస్‌లో ఐసీఈ అధికారులు కాల్చి చంపారు. ఈ ఘటనలో అధికారులను ట్రంప్ సమర్థించారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ కవి, ముగ్గురు పిల్లల తల్లి అయిన రెనీ నికోల్ గుడ్ (37)ను యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ (ఐసీఈ) అధికారి కాల్చిచంపారు. అమెరికాలోని మినియాపోలిస్‌లో జరిగిన ఈ ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఐసీఈ చర్యల సమయంలో లీగల్ పర్యవేక్షకురాలిగా ఉన్న ఆమెను ఐసీఈ ఏజెంట్లు కాల్చిచంపారు. ఆమెకు ముగ్గురు పిల్లలు, వారిలో ఒకరు ఆరేళ్ల బాబు కావడం గమనార్హం. నిరసనలు ప్రశాంతంగా సాగేందుకు, అధికారులు హద్దు మీరకుండా చూసేందుకు వాలంటీరుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. దీంతో యూఎస్‌లో ఐసీఈని బ్యాన్ చేయాలంటూ పలువురు నిరసనలకు దిగారు. జరిగిన ఘటన విషాదకరమైనప్పటికీ, ఐసీఈ అధికారి తప్పులేదన్న యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ‘ఆమె చాలా దారుణంగా ప్రవర్తించింది. అధికారిని వాహనంతో తొక్కేయడానికి ట్రై చేయడం కాదు.. తొక్కేసింది’ అన్నారు.
Next Story






