- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జో బైడెన్, కమలా హ్యారిస్‌లు అమెరికాను నాశనం చేశారు: ట్రంప్
జో బైడెన్, కమలా హ్యారిస్‌లు అమెరికాను నాశనం చేశారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌పై ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఏమాత్రం దర్యాప్తు లేకుండా వలసదారులను యూఎస్‌లోకి అనుమతించి, అమెరికాను భ్రష్టుపట్టించారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల వాషింగ్టన్‌లో ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులను ఒక ఆఫ్ఘన్ వ్యక్తి కాల్చి చంపిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘బుద్ధిలేని జోబైడెన్, బోర్డర్ సీజార్ అని చెప్పుకున్న కమలా హ్యారిస్ కలిసి, ఏమాత్రం దర్యాప్తు, చెకింగ్ లేకుండా వలసదారులను దేశంలోకి అనుమతించి మొత్తం దేశాన్ని భ్రష్టుపట్టించారు’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో నిప్పులు చెరిగారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) కూడా బైడెన్ సర్కారు వల్లనే ఈ సమస్య వచ్చిందని ఆరోపించింది. బైడెన్ ప్రభుత్వం ఇలా అక్రమ వలసదారులను దేశంలోకి అనుమతించడం ద్వారా దేశ భద్రతను ధ్వంసం చేసిందని పేర్కొంది. కాగా, కొన్నిరోజుల క్రితమే మూడో ప్రపంచ దేశాల నుంచి వలసదారులను యూఎస్‌లోకి అనుమతించబోనని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో యూఎస్ ఇమిగ్రేషన్ వ్యవస్థను కఠినతరం చేస్తానని కూడా ఆయన చెప్పారు.






