- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైనాతో ట్రేడ్ డీల్ కుదిరింది.. సుంకాల లెక్కలు కూడా ప్రకటించేసిన ట్రంప్..!
by Phanindra |
చైనాతో యూఎస్ ట్రేడ్ డీల్ కుదిరింది. సుంకాల లెక్కలు కూడా ట్రంప్ ప్రకటించేశారు..!

X
దిశ, నేషనల్ బ్యూరో: చైనాతో వాణిజ్య ఒప్పందం దాదాపు ఖాయమైందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘చైనాతో డీల్ పూర్తయింది. ఇక కేవలం ప్రెసిడెంట్ జీ జిన్‌పింగ్, నేనూ సంతకాలు పెట్టాలంతే. పూర్తి మ్యాగ్నెట్లు, ఇతర ఖనిజాలను చైనా మనకు ముందుగా సప్లయ్ చేస్తుంది. యూఎస్‌లోని కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకోవడానికి చైనా విద్యార్థులకు పర్మిషన్లు ఇవ్వడం తదితర ఒప్పందాన్ని మనం పూర్తిచేస్తాం. అలాగే యూఎస్‌కు 55 శాతం, చైనాకు 10 శాతం టారిఫ్స్ పడతాయి. రెండు దేశాల మధ్య సంబంధం అద్భతుంగా ఉంది. ఈ విషయంపై దృష్టిపెట్టినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. కొన్నిరోజుల క్రితమే కొన్ని కీలకమైన ఖనిజాల ఎగుమతిని చైనా నిలిపివేసిందంటూ ట్రంప్ మండిపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి రెండు దేశాలు చర్చలు జరిపి, తాజా డీల్ చేసుకున్నాయి.
Next Story






