జిన్‌పింగ్‌తో కాల్ మాట్లాడిన ట్రంప్.. ట్రేడ్ డీల్ గురించే చర్చా?

by Phanindra |

యూఎస్, చైనా మధ్య వాణిజ్య పరిస్థితులు వేడెక్కుతున్న సమయంలో జిన్‌పింగ్‌తో ట్రంప్ కాల్ మాట్లాడారు. వీళ్లిద్దరూ ట్రేడ్ డీల్ గురించే చర్చించారా?

జిన్‌పింగ్‌తో కాల్ మాట్లాడిన ట్రంప్.. ట్రేడ్ డీల్ గురించే చర్చా?
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనా-యూఎస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో ఇరుదేశాల నేతలు ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు సమాచారం. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రిక్వెస్ట్‌ చేయడంతోనే జిన్‌పింగ్ ఈ కాల్ మాట్లాడారని చైనా ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ షినువా పేర్కొంది. అయితే ఈ ఇద్దరు లీడర్లు ఏ విషయంపై చర్చలు జరిపారని మాత్రం వెల్లడించలేదు. ఇటీవలే కొన్ని కీలకమైన మినరల్స్ ఎగుమతుల విషయంలో రెండు దేశాల మధ్య సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే.


ఈ విషయంలో చైనా ఒప్పందం ఉల్లంఘించిందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండు దేశాల మధ్య 90 రోజుల డీల్ కుదిరిన రోజుల వ్యవధిలోనే ఇలా జరగడం గమనార్హం. దీంతో ఇరుదేశాల మధ్య వ్యాపార సంబంధాలు చాలా వేడెక్కాయి. ఇలాంటి నేపథ్యంలో ఇరువురు నేతలు కాల్ మాట్లాడుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీళ్లిద్దరూ ట్రేడ్ డీల్ గురించే చర్చించి ఉంటారని నిపుణులు భావిస్తున్నారు.

Next Story