- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా మాజీ అధ్యక్షుడికి క్యాన్సర్.. నిర్ధారించిన వైద్యులు
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)కు ప్రోస్టేట్ క్యాన్సర్ (Prostate Cancer) సోకినట్లుగా ఆయన కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)కు ప్రోస్టేట్ క్యాన్సర్ (Prostate Cancer) సోకినట్లుగా ఆయన కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ఇటీవలే ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ప్రోస్టేట్‌లో ఓ చిన్న గడ్డను వైద్యులు కనుగొన్నారు. ఫిలడెల్ఫియా (Philadelphia)లోని ఆసుపత్రిలో శనివారం యూరిన్ సంబంధిత టెస్ట్‌లను నిర్వహించిన డాక్టర్లు రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించి అది ప్రోస్టేట్ క్యాన్సరేనని నిర్ధారించారు. ప్రస్తుతం ఆ క్యాన్సర్ ఎముకలకు కూడా వ్యాపించిందని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే బైడెన్ కార్యాయలయ సిబ్బంది మాట్లాడుతూ.. ప్రోస్టేట్ క్యాన్సర్ తీవ్ర రూపం దాల్చినప్పటికీ.. హార్మోన్స్ సెన్సిటివ్‌గా ఉండటం వల్ల బైడెన్‌కు సమర్థవంతంగా చికిత్స అందజేసేందుకు సాధ్యమవుతుందని తెలిపారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కాగా, 2023 ఫిబ్రవరిలో జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన ఛాతీ నుంచి కూడా ఒక గడ్డను తొలగించిన విషయం తెలిసిందే. వైట్‌హౌస్ వైద్యుడు డాక్టర్ కెవిన్ (Dr. Kevin) ఆ గడ్డను బేసల్ సెల్ కార్సినోమాగా నిర్ధారించారు. అప్పట్లో దానికి చికిత్స కూడా అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ విషయం తెలిసిన ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్ వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.






