- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రం వసూలు చేసే పన్నుల్లో ఏ రాష్ట్రానికి అధికంగా తిరిగి చెల్లిస్తుందో తెలుసా..?
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి వసూల్ చేస్తున్న పన్నులను తిరిగి చెల్లించే విధానంలో గత కొంత కాలంగా అనేక రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి వసూల్ చేస్తున్న పన్నులను తిరిగి చెల్లించే విధానంలో గత కొంత కాలంగా అనేక రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పన్నులను తిరిగి చెల్లించే విధానం ఇప్పటికి రాష్ట్రాల ప్రజలకు అనేక సందేహాలు ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో కొంత భాగం భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని “divisible pool” లో భాగంగా పరిగణిస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న 15 ఆర్థిక సంఘం (15th Finance Commission) సిఫార్సుల మేరకు, కేంద్రం వసూలు చేసే విభజించదగిన పన్నుల్లో 41 శాతం రాష్ట్రాలకు ఇవ్వబడుతుంది. అయితే అన్ని పన్నులు ఈ విభజనలో చేరవు.
ఉదాహరణకు cess, surcharges వంటివి “divisible pool” లో లేవు కాబట్టి, రాష్ట్రాలకు వాస్తవంగా అందే శాతం కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇటీవల కేంద్రం రాష్ట్రాలకు ₹1.73 లక్షల కోట్ల ట్యాక్స్ డివల్యూషన్ నిధులను విడుదల చేసింది. ఇందులో ఉత్తరప్రదేశ్‌కు మాత్రమే సుమారు ₹31,000 కోట్లకు పైగా వెళ్లింది. ఈ విధంగా రాష్ట్రాల అవసరాలను, వారి జనాభా, భౌగోళిక విస్తీర్ణం, అభివృద్ధి స్థాయిలను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ జరుగుతుంది.
అయితే కేంద్రం రాష్ట్రాల నుంచి వసూలు చేసే ప్రతి 100 రూపాయల్లో రాష్ట్రాలకు తిరిగి చెల్లించే విధానంలో భాగంగా అత్యధికంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి రూ. 4278.8 చెల్లిస్తుండగా.. మహారాష్ట్రకు అత్యల్పంగా 6.8 రుపాయలను చెల్లిస్తుంది. అలాగే హిమాచల్ ప్రదేశ్ కు రూ. 153.3, ఉత్తరాఖండ్ కు రూ. 150.8, ఉత్తర ప్రదేశ్ కు రూ. 293.2, బీహార్ రూ. 771.5 సిక్కిం రూ. 573.3, మేఘాలయ రూ. 409 అస్సాం రూ. 312, నాగాలాండ్ రూ. 1101.9, మణిపూర్ కు రూ. 1306.3, మిజోరం కు రూ. 3152.3, త్రిపుర 947.5 రూపాయలు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాని 79.4 రూపాయలు, ఒరిస్సాకు 164.8 రూపాయల, ఝార్ఖండ్ కు 266.9 రూపాయలు చెల్లిస్తుంది
అలాగే చత్తీస్ఘడ్ కు 248.4 రూపాయలు, మధ్యప్రదేశ్ కు 245.6 రూపాయలు, తెలంగాణకు 43.9 రూపాయలు, ఆంధ్రప్రదేశ్ కు 40.5 రూపాయలు, తమిళనాడుకు 26.2 రూపాయలు, కేరళకు 55.8 రూపాయలు, కర్ణాటకకు 12.3 రూపాయలు, గోవాకు 76.1 రూపాయలు, గుజరాత్ కు 27.6 రూపాయలు, రాజస్థాన్ కు 135.6 రూపాయలు, హర్యాణకు 16.4 రూపాలయు, పంజాబ్ కు 64.2 రూపాయలను కేంద్ర తిరిగి చెల్లిస్తుంది. అయితే ఈ చెల్లింపులు రాజ్యాంగానికి కట్టుబడి ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఉంటాయని కేంద్ర స్పష్టంగా చెబుతోంది.






