మీ దగ్గర రూ.10, 20 కాయిన్స్‌ ఉన్నాయా.. అయితే కేంద్రం ఏం చెప్పిందో తెలుసుకోండి!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-02-05 09:25:18  IST  )

సాధారణంగా చిల్లర లావాదేవీలకు నిత్యం రూపాయి, 2 రూపాయిల నాణేలను వినియోగిస్తుంటారు.

మీ దగ్గర రూ.10, 20 కాయిన్స్‌ ఉన్నాయా.. అయితే కేంద్రం ఏం చెప్పిందో తెలుసుకోండి!
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా చిల్లర లావాదేవీలకు నిత్యం రూపాయి, 2 రూపాయిల నాణేలను వినియోగిస్తుంటారు. ఎవరైనా ఇచ్చిన కూడా సంకోచించకుండా తీసుకుంటారు. అయితే, అదే 10, 20 రూపాయిల నాణేల విషయానికి వచ్చేసరికి సందేహిస్తుంటారు. కారణం.. త్వరలో ఆ నాణేలు నిలిపివేస్తారంటూ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు. ఈ క్రమంలో కేంద్రం, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) రూ.10, 20 నాణేలు, నోట్లపై క్లారిటీ ఇచ్చింది.

కరెన్సీకి సంబంధించిన ఏవైనా నిర్ణయాలు అధికారిక ప్రకటనల ద్వారా మాత్రమే తెలియజేస్తామని కేంద్రం పేర్కొంది. నోట్ల ముద్రణ నిలిపివేత, నాణేలు చెల్లుబాటు కావంటూ వచ్చే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. 10 రూపాయల నాణేలు, నోట్లు చెలామణిలో ఉంటాయని పేర్కొంది. అలాగే, అవసరమైతే కొత్త 10 రూపాయల నాణేలు మళ్లీ ప్రింట్ చేస్తామని వెల్లడించింది. అలాగే, రూ.20 నోట్లపై కూడా ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది.

అలాగే, రూ.20 నాణెం గురించి కూడా కేంద్రం తాజాగా వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న 10 రూపాయల నాణేలలా, 20 రూపాయల నాణేలు తయారవుతున్నట్లు చెప్పింది. అయితే, కొత్త 20 రూపాయల నాణెం మార్కెట్‌లో ఎప్పుడు వస్తుందో ఇంకా క్లారిటీ లేదు. కాగా, కేంద్ర ప్రభుత్వం 2020లో తొలిసారిగా రూ. 20 నాణేలను జారీ చేసింది. రూ.20 నాణెం 12 భుజాల బహుభుజిగా ఉంటుందని, దానిపై ధాన్యం ఆకారం ఉంటుందని, ఇది వ్యవసాయ రంగ ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుందని ఆ సమయంలో చెప్పింది. ఇక సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌లు ప్రజలలో భయాన్ని కలిగిస్తున్నాయని, వాటిని నమ్మకూడదని అధికారులు సూచిస్తున్నారు.

Next Story