- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్రమంత్రి వ్యాఖ్యలతో తమిళనాడులో డీఎంకే ఆందోళనలు ఉదృతం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Union Minister Dharmendra Pradhan) చేసిన వ్యాఖ్యలతో తమిళనాడు (Tamilnadu) లో డీఎంకే (DMK Party) ఆందోళనలు (Protest) ఉధృతం అయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Union Minister Dharmendra Pradhan) చేసిన వ్యాఖ్యలతో తమిళనాడు (Tamilnadu) లో డీఎంకే (DMK Party) ఆందోళనలు (Protest) ఉధృతం అయ్యాయి. చైన్నై (Chennai), కోయింబత్తూర్ (Koimbathur), మదురై (Madurai) సహా రాష్ట్రంలోని పలు చోట్ల డీఎంకే పార్టీ నేతలు (DMK Party Leaders) నిరసనలు చేస్తున్నారు. తమిళనాడులో గత కొద్ది రోజులుగా హిందీ భాషా (Hindi Language) విధానంపై వ్యతిరేఖ ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు తమిళనాడు సీఎం స్టాలిన్ (CM Stalin) తన పుట్టిన రోజు సందర్భంగా.. తమిళ భాష, సంస్కృతి ప్రమాదంలో పడే అవకాశం ఉందని, హిందీ వ్యతిరేఖ ఉద్యమానికి సిద్దంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీని కోసం ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలోనే హిందీ భాషకు వ్యతిరేఖంగా తమిళనాడులో ఉద్యమాలు జరగగా.. ఇప్పుడు కేంద్రం తీసుకువస్తామంటున్న త్రిభాషా విధానం (Three Language Policy) వల్ల తమిళనాడు ప్రజలు మరోసారి ఉద్యమ బాట పడుతున్నారు.
హిందీని బలవంతంగా తమపై రుద్దాలని చూస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని డీఎంకే నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి తమిళనాడులో జరుగుతున్న వ్యవహారంపై స్పందించారు. హిందీ విషయంలో తమిళనాడు తీరు అనాగరికమని ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. దీంతో డీఎంకే నేతలు కేంద్రమంత్రిపై ఫైర్ అవుతున్నారు. తమిళనాడు వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఆందోలనలకు దిగారు. రోడ్లపైకి వచ్చి కేంద్రానికి వ్యతిరేఖంగా నిరసనలు చేస్తున్నారు. ధర్మేంద్ర ఫ్రధాన్ ను వెంటనే బర్త్‌రఫ్ చేయాలని డీఎంకే డిమాండ్ చేస్తోంది. ఈ వివాదంపై తమిళనాడు బీజేపీ నేత అన్నామలై (BJP Leader Annamalai) స్పందిస్తూ.. కేంద్రమంత్రికి మద్దతుగా నిలిచారు. ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యల్లో తప్పు లేదని సమర్ధించారు. అంతేగాక కేంద్రమంత్రి డీఎంకే వ్యవహార శైలిని మాత్రమే తప్పు పట్టారని అన్నామలై వ్యాఖ్యానించారు.






