డీఎంకే ఎంపీ ఏ. రాజాకు తప్పిన ఘోర ప్రమాదం

by velandi.Saikiran |

డీఎంకే ఎంపీ ఏ రాజాకు ( DMK MP A Raja ) ఊహించని పరిణామం ఎదురైంది. ఆయనకు పెను ప్రమాదమే తప్పింది. ఓ పబ్లిక్ మీటింగ్

డీఎంకే ఎంపీ ఏ. రాజాకు తప్పిన ఘోర ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : డీఎంకే ఎంపీ ఏ రాజాకు ( DMK MP A Raja ) ఊహించని పరిణామం ఎదురైంది. ఆయనకు పెను ప్రమాదమే తప్పింది. ఓ పబ్లిక్ మీటింగ్ లో డీఎంకే ఎంపీ ఏ రాజా మాట్లాడుతుండగా... ఒక్కసారిగా లైట్ స్టాండ్ (Light Stand) కూలింది. నిన్న సాయంత్రం మైలాడుతురై అనే ప్రాంతంలో ప్రజా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా డీఎంకే ఎంపీ రాజా మాట్లాడారు.

ఆయన మాట్లాడుతుండగానే... గాలి దుమారం ఒక్కసారిగా వచ్చింది. దీంతో.. అక్కడ ఏర్పాటు చేసిన లైట్ స్టాండ్ కూలిపోయింది. అయితే అది కూలడాన్ని గమనించిన డీఎంకే ఎంపీ రాజా... వెంటనే సైడ్ కు జరిగారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇక ఈ ప్రమాదం జరిగిన వెంటనే అలర్ట్ అయిన.. నాయకులు అక్కడి నుంచి డీఎంకే ఎంపీ రాజాను తీసుకువెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ప్రమాదంలో డీఎంకే ఎంపీ ఏ రాజాకు ( DMK MP A Raja ) ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో ఆయన అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story