- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీవీకే అంటే త్రిష, కీర్తి సురేష్..విజయ్ పార్టీపై మంత్రి సెటైర్లు
తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ తలపతిపై డీఎంకే నేత, మంత్రి పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ తలపతిపై డీఎంకే నేత, మంత్రి పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ పొలిటికల్ మీటింగ్‌లో మంత్రి మాట్లాడుతూ.. ఒకరు బ్లాక్ టికెట్లు అమ్ముకునే వ్యక్తి అవినీతి గురించి పాఠాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన బ్లాక్ మనీని జీతంగా తీసుకుంటున్నారని అన్నారు. సొంత తల్లి దండ్రులతో కూడా కలిసి ఉండనివాడు రాష్ట్రాన్ని కాపాడుతాడంట అంటూ ఎద్దేవా చేశారు. టీవీకే అంటే ఏంటి అని ఆ మీటింగ్ కు వచ్చిన జనసమూహాన్ని అడగ్గా వారు.. త్రిష, కీర్తి సురేష్ అంటూ సమాధానాలు ఇచ్చారు.
దీంతో మీరంతా బ్రిలియంట్స్ అంటూ మంత్రి వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. ఈ పార్టీ అధికారంలోకి వస్తామని చెబుతోంది, రాష్ట్రాన్ని నడపటం అంటే సినిమాలో నటించడం అనుకుంటున్నారా.? అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే విజయ్ పార్టీ స్థాపించిన తరవాత తన ప్రసంగంలో 2026లో జరిగే ఎన్నికల్లో డీఎంకే, టీవీకే మధ్యలోనే పోటీ ఉంటుందని అన్నారు. డీఎంకేను ఓడించి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. నిజానికి తమిళనాట విజయ్‌కి ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ సినిమా వచ్చిందంటే తమిళనాట అభిమానులు పండగ చేసుకుంటారు. ట్విట్టర్‌లో ఆయన సినిమా ట్వీట్లు ట్రెండింగ్‌లో ఉంటాయి. మరి ఆ అభిమానం ఓట్లుగా కన్వర్ట్ అవుతుందా లేదా అనేది చూడాలి.






