- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ‘X’ వేదికగా బెస్ట్ విషెస్ తెలియజేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్ (DK Shiva Kumar)కు ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ సాయంత్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చఏశారు. ‘కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ డీకే శివకుమార్ గారికి అభినందనలు. ఆయన పదవీ కాలం విజయవంతం కావాలని కోరుకుంటూ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. కర్ణాటక ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కట్టుగా పని చేస్తుంది’ అని ప్రధాని మోడీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇక ప్రధాని మోడీ తన అధికారిక ఖాతా ద్వారా చేసిన ఈ ట్వీట్‌లో డీకే శివకుమార్ వ్యక్తిగత ‘X’ ఖాతా (@DKShivakumar)ను కూడా ట్యాగ్ చేశారు. సరికొత్త రాజకీయ సమీకరణాల నడుమ కర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టిన శివకుమార్‌కు ప్రధాని నుంచి ఈ రకమైన సానుకూల మద్దతు లభించడం విశేషం. రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సగీభావంతో కర్ణాటక మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తమిళనాడులో కూటమి సమీకరణాలు.. కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన టీవీకే






