- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Karnataka: 'లేని వాళ్ల ప్రస్తావన ఎందుకు?': కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం
పార్టీ కార్యకర్త ఒకరు శివకుమార్ పేరును ప్రస్తావించలేదని అడిగారు. దీంతో ఆగ్రహానికి గురైన సీఎం సిద్ధరామయ్య..

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి విషయంలో నెలకొన్న ఊహాగానాలు మరోసారి బహిర్గతమయ్యాయి. సీఎం మార్పు గురించి కీలక నేతలు ఎప్పటికప్పుడు ఖండిస్తున్నప్పటికీ అందుకు తగిన పరిణామాలూ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మైసూరు జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేరును తన ప్రసంగంలో ప్రస్తావించాలనే సూచనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సంబంధించి కొత్త ప్రాజెక్టులను ప్రకటించిన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గెతో పాటు ప్రభుత్వంలోని ఇతర అగ్రనేతలు, డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా హాజరయ్యారు. ఆయన ప్రసంగం అనంతరం అత్యవసర పనిమీద బెంగళూరుకు వెళ్లిపోయారు. అనంతరం సీఎం సిద్ధరామయ్య ప్రసంగం సందర్భంగా పార్టీ కార్యకర్త ఒకరు శివకుమార్ పేరును ప్రస్తావించలేదని అడిగారు. దీంతో ఆగ్రహానికి గురైన సీఎం సిద్ధరామయ్య.. డీకే శివకుమార్ ఇక్కడ లేరు కదా? వెళ్లి కూర్చోండి. ఆయన బెంగళూరుకు తిరిగి వెళ్లిపోయారు. వెళ్ళిపోయిన వారి పేర్లను కాదు, వేదికపై ఉన్నవారి పేర్లను ప్రస్తావించాలి. ఇంట్లో కూర్చున్న వారిని కాదు, ఇక్కడ ఉన్నవారిని ఆహ్వానించడమే ప్రోటోకాల్ అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన నాటి నుంచే ముఖ్యమంత్రి పదవిపై అసంతృప్తులు మొదలయ్యాయి. అనేక సంప్రదింపుల తర్వాత సీనియారిటీ ఆధారంగా సిద్ధరామయ్యకు పదవి దక్కింది. అయితే, ఆనాటి నుంచే రెండున్నరేళ్లకు ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.






