- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్ణాటక సీఎం రేసు.. నేడు ఢిల్లీ వెళ్లనున్న డీకే శివకుమార్..
కర్ణాటక సీఎం పదవీ ఎవరికి దక్కుంతుందోనని దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఈ క్రమంలో సీఎం రేసులో ఉన్న డీకే, సిద్దరామయ్యలను ఢిల్లీ రావాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక సీఎం పదవీ ఎవరికి దక్కుంతుందోనని దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఈ క్రమంలో సీఎం రేసులో ఉన్న డీకే, సిద్దరామయ్యలను ఢిల్లీ రావాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించింది. దీంతో సోమవారం సిద్దరామయ్య ఒక్కడే ఢిల్లీ చేరుకోగా.. కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా సోమవారం డీకే తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలిపారు. అలాగే మరోసారి ఢిల్లీ రావాలని ఆయనకు పిలుపు రావడంతో.. మంగళవారం దేశ రాజధాని వెళ్లడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. "పార్టీ హైకమాండ్ పిలుపునిచ్చింది. మేమంతా ఒక్కటే.. అందరం కలిసి పనిచేస్తాం" అని శివ కుమార్ తెలిపారు. కర్ణాటక తదుపరి సీఎం పేరును కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఈ రోజు ఖరారు చేయనున్నారు.
Next Story






