- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Benguluru Stampede : కన్నీటి పర్యంతం అయిన డీకే శివకుమార్
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) నేడు మీడియా ముందు కన్నీటి పర్యంతం అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) నేడు మీడియా ముందు కన్నీటి పర్యంతం అయ్యారు. నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) సమీపంలో ఆర్‌సీబీ ఐపీఎల్ విజయోత్సవాల(RCB Vctory Parade) సందర్భంగా జరిగిన తొక్కిసలాట(Benguluru Stampede) ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. ఈ ఘటనలో 11 మంది మరణించగా, 70 మందికి పైగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ఈ విషాదం తన గుండెను మెలితిప్పిందని.. ముఖ్యంగా చిన్న పిల్లలు చనిపోవడం బాధాకరమని అన్నారు. గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ తన కళ్ల ముందే పలువురు ప్రాణాలు కోల్పోవడం తట్టుకోలేక పోయానని కన్నీటి పర్యంతం అయ్యారు.
ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. స్టేడియం సామర్థ్యం 35,000 మాత్రమే అయినప్పటికీ, 3 లక్షలకు పైగా జనం తరలివచ్చారని, గేట్లు కూడా ధ్వంసమయ్యాయని, ఈ పరిస్థితిని అంచనా వేయలేకపోయామని క్షమాపణలు చెప్పారు. ప్రతిపక్ష బీజేపీ ఈ ఘటనను శవ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. అయితే తాము రాజకీయాలు చేయకుండా పూర్తి బాధ్యతతో వాస్తవాలను తెలుసుకుని భవిష్యత్తులో మెరుగైన పరిష్కారాలు చేస్తామని చెప్పారు.
కర్ణాటక ప్రభుత్వం ఈ ఘటనకు గుర్తుగా శుక్రవారం అన్ని అధికారిక కార్యక్రమాలను (కేబినెట్ సమావేశం మినహా) రద్దు చేసింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరణించినవారి కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం, గాయపడినవారికి ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. ఈ ఘటనపై మజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు, 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించారు.






