- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇబ్బందులు తలెత్తకుండా.. దివ్య్ అయోధ్య యాప్
అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా యూపీ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది

అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా యూపీ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే భక్తులకు సౌకర్యార్ధం, అయోధ్య గురించి అవసరమైన సమాచారం తెలుసుకునేందుకు ‘దివ్య్ అయోధ్య’ అనే యాప్‌ను ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విడుదల చేశారు.
సమగ్ర సమాచారానికి ఒకే యాప్
ఈ యాప్ ద్వారా నగరంలోని వివిధ ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి తెలుసుకోవడమే కాకుండా, అద్దె గదుల సమాచారం, హోటళ్లు, గుడారాలు, వీల్‌ఛైర్ అసిస్టెంట్, గోల్ఫ్‌కార్ట్ వాహనాలు, ఎలక్ట్రిక్ కార్లు, బస్సులను, టూరిస్ట్ గైడ్‌లను ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. యాప్‌లో స్థానిక వంటలు, తప్పక చూడాల్సిన ప్రదేశాలు, టూర్ ప్యాకేజ్‌లకు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకోవచ్చు.
ఆధ్యాత్మిక పర్యాటక నగరంగా అయోధ్య
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యను ఆధ్యాత్మిక పర్యాటక నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా నగర శివార్లలో గ్రామీణ వాతావరణంలో పర్యాటకులకు అద్దెకు ఇచ్చేందుకు ఇళ్లను నిర్మించాలని చూస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ధర్మ పథ్, రామ్ పథ్ పేరుతో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను ప్రారంభించారు. అలాగే జనవరి 19 నుంచి లఖ్‌నవూ- అయోధ్య మధ్య హెలికాప్టర్ సర్వీస్‌ను కూడా ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 11 వేల మందికి పైగా అతిథులు హాజరవుతారని ట్రస్టు సభ్యులు తెలిపారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత అయోధ్యను సందర్శించే భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనపై యోగి ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలిసింది.






