జిల్లా పంచాయతీ సభ్యుడి హత్య కేసు.. అధికార పార్టీ ఎమ్మెల్యేపై అనర్హత వేటు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-03 05:36:11  IST  )

హత్య కేసులో దోషిగా తేలడంతో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణిపై అనర్హత వేటు పడింది.

జిల్లా పంచాయతీ సభ్యుడి హత్య కేసు.. అధికార పార్టీ ఎమ్మెల్యేపై అనర్హత వేటు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక (karnataka) రాజకీయాల్లో సంచలనం సంచలనం చోటుచేసుకుంది. ధార్వాడ్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి (Vinay Kulkarni)పై అనర్హత వేటు పడింది. జిల్లా పంచాయతీ సభ్యుడు యోగేష్ గౌడర్ (Yogesh Gowder) హత్య కేసులో ఆయన దోషిగా తేలడంతో ప్రజాప్రతినిధులక కోర్టుల ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, యోగేష్ గౌడర్ హత్య కేసులో వినయ్ కులకర్ణి ప్రమేయం ఉన్నట్లు కోర్టు నిర్ధారించింది. ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం, రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలం శిక్ష పడిన ఎమ్మెల్యేలు తక్షణమే తమ పదవికి అనర్హులవుతారు. తాజాగా వినయ్ కులకర్ణిపై అనర్హత వేటు పడటంతో ధార్వాడ్ శాసనసభ స్థానం ఖాళీ అయినట్లుగా అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రకటించింది. దీంతో అక్కడ త్వరలోనే ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది.

కాగా, 2016లో ధార్వాడ్‌ (Dharwad)లో యోగేష్ గౌడర్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో వినయ్ కులకర్ణి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సీబీఐ దర్యాప్తులో ఆయనకు వ్యతిరేకంగా కీలక ఆధారాలు లభించడంతో కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. వినయ్ కులకర్ణి ఉత్తర కర్ణాటకలో బలమైన నాయకుడిగా, మాజీ మంత్రిగా పేరు పొందారు. ఇప్పుడు ఆయన అనర్హతకు గురికావడం అధికార కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రాంతంలో కొంత ప్రతికూలత కలిగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story