- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Google Meet: గూగుల్ మీట్ సేవల్లో అంతరాయం.. ఇండియన్ యూజర్లకు చుక్కలు
గూగుల్ మీట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ ఆన్‌లైన్ వీడియో కాలింగ్, మీటింగ్ ప్లాట్‌ఫామ్ గూగుల్ మీట్ సేవల్లో అంతరాయం (Google Meet Down) ఏర్పడింది. బుధవారం ఇండియాలో చాలా మంది యూజర్లు గూగుల్ మీట్ సర్వీస్ పని చేయక ఇబ్బందులు పట్టారు. ముఖ్యంగా రిమోట్ వర్క్ చేసే వారు తమ ఆన్ లైన్ మీటింగ్ లకు అటెండ్ కావడానికి ప్రయత్నిస్తుంటే విఫలం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీటింగ్‍లలో చేరేందుకు ప్రయత్నించిన యూజర్లకు '502. దట్ ఈజ్ ఆన్ ఎర్రర్. సర్వర్ తాత్కాలిక లోపాన్ని ఎదుర్కొంటోంది. మీ అభ్యర్థనను పూర్తి చేయలేకపోయాము. దయచేసి 30 సెకన్లలో మళ్లీ ప్రయత్నించండి' అనే సందేశాన్ని చూపించింది. దీంతో యూజర్లు ఎక్స్ తో పాటు ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‍పై తమ సమస్యను పోస్టు చేశారు. అయితే అవుట్ టేజ్ ట్రాకింగ్ వెబ్ సైట్ డౌన్ డిటెక్టర్ ప్రకారం గూగుల్ మీట్ లో కనెక్టివిటీ సమస్యకు సంబంధించి దాదాపు 2 వేలకు పైగా ఫిర్యాదులు నమోదు అయ్యారు.






