వాట్సాప్ సేవల్లో అంతరాయం

by Gantepaka Srikanth |
వాట్సాప్ సేవల్లో అంతరాయం
X

దిశ, వెబ్‌డెస్క్: వాట్సాప్(WhatsApp) సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. మెసేజ్‌లు వెళ్లడం లేదని, స్టేటస్‌లు(WhatsApp Status) అప్‌లోడ్ కావట్లేని భారత్‌లోని పలువురు యూజర్లు సోషల్ మీడియా వేదికగా మెటాకు కంప్లైంట్లు చేస్తున్నారు. సిస్టమ్స్‌లోనూ వాట్సాప్ లాగిన్ కావడం లేదని పోస్టులు పెడుతున్నారు. ఈ ఉదయం యూపీఐ(UPI) సేవల్లో అంతరాయం ఏర్పడగా, ప్రస్తుతం వాట్సాప్ పనిచేయకపోవడంతో యూజర్లు కంగారు పడుతున్నారు. శనివారం సాయంత్రం 5:13 గంటల వరకు వాట్సాప్‌పై కనీసం 463 ఫిర్యాదులు నమోదయ్యాయి. 80% కంటే ఎక్కువ ఫిర్యాదులు వాట్సాప్ నుంచి మెసేజులు పంపడానికి ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. మరో 15% మంది యాప్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, 4% మంది లాగిన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.



Next Story

Most Viewed