- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడు ప్రధాన బిల్లులపై చర్చ.. ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ప్రారంభం
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుపై కీలక బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు తొలిరోజున కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది. మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మూడు ముఖ్యమైన బిల్లులను ప్రతిపాదించనున్నారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లులో భాగంగా మహిళా రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం చేస్తూ, దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టేందుకు ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం స్వతంత్ర ‘డీలిమిటేషన్ కమిషన్’ను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన మరో బిల్లును మంత్రి సభలో ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో (UTs) కూడా నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించేలా ప్రత్యేక బిల్లును ప్రభుత్వం తీసుకురానుంది.
దిగ్గజాలకు నివాళులు..
సభ ప్రారంభమైన వెంటనే మూడు బిల్లులపై చర్చకు ముందు, ఇటీవల మృతి చెందిన భారతీయ సంగీత దిగ్గజం, ప్రముఖ గాయని ఆశాభోస్లేకు పార్లమెంట్ ఘనంగా నివాళులర్పించింది. ఆమెతో పాటు మాజీ కేంద్ర మంత్రి హసీం ఖాన్ చౌధరీ, ఇతర దివంగత నేతల మృతికి సంతాపం ప్రకటిస్తూ సభ సభ్యులు మౌనం పాటించారు. ఈ బిల్లులపై చర్చ సందర్భంగా విపక్షాలు డీలిమిటేషన్ నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.






