రాజ్యసభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ.. సభ నుంచి విపక్షాల వాకౌట్

by Kema Shiva Kumar |

పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఎనిమిది రోజు ఇవాళ రాజ్యసభ (Rajya Sabha)లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ కొనసాగుతోంది.

రాజ్యసభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ.. సభ నుంచి విపక్షాల వాకౌట్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఎనిమిది రోజు ఇవాళ రాజ్యసభ (Rajya Sabha)లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ కొనసాగుతోంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ (N Jaishankar) మధ్యాహ్నం ఒంటిగంటకు చర్చను ప్రారంభించారు. హౌస్ లీడర్ జేపీ నడ్డా (JP Nadda) ప్రసంగం ముగియగానే విపక్ష సభ్యులు పహల్గాం టెర్రర్ అటాక్‌ విషయంలో ఇంటెలిజెన్స్ వైఫల్యంపై వాడివేడిగా ప్రసంగించారు. అనంతరం సభలోకి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆపరేషన్ సిందూర్‌పై ప్రసంగాన్ని ప్రారంభించారు. పహల్గాం టెర్రర్ అటాక్‌కు బదులుగా పీవోకేతో పాటు పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వసం చేశామని తెలిపారు. ఉక్రమూకలకు ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి గుణపాఠం చెప్పిందని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రసంగానికి విపక్షాలు పదేపదే అడ్డు తగిలాయి. పహల్గాం టెర్రర్ అటాక్‌పై ప్రధాని మోడీ సభకు వచ్చిన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. పదే పదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినా.. వారు అడిగిన ప్రశ్నకు అమిత్ షా నుంచి ఎలాంటి జవాబు రాకపోవడంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.

Next Story