మోడీ కమల్ హాసన్ భేటీలో కీళడిపై చర్చ.. తమిళనాట హాట్ టాపిక్ "కీళడి" స్టోరీ ఏంటి?

by Ajay Maddhiboyina |

కీళడి అనేది తమిళనాడులోని ఓ పురావస్తు ప్రదేశం. ఇది శివగంగై జిల్లాలోని వైగై నది ఒడ్డున ఉన్న చారిత్రక గ్రామం. ఇక్కడ జరిపిన తవ్వకాలలో తమిళ సంస్కృతి, నాగ‌రిక‌త‌కు సంబంధించి కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

మోడీ కమల్ హాసన్ భేటీలో కీళడిపై చర్చ.. తమిళనాట హాట్ టాపిక్ కీళడి స్టోరీ ఏంటి?
X

దిశ‌, వెబ్ డెస్క్: తమిళ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా జరిగిన భేటీలో తమిళ నాగరికత గొప్పతనాన్ని, తమిళ భాష వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో మద్దతు అందించాలని ప్రధానిని కోరినట్టు ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. అంతే కాకుండా తమిళనాడులో కీళడి గురించి ప్రధానంగా చర్చించినట్టు కమల్ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో కీళడి అనే పేరు తమిళ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవల సీఎం స్టాలిన్ సైతం ఈ పదాన్ని ఎక్కువగా చెబుతున్నారు. అసలు కీళడి అంటే ఏంటి.. దాని ప్రత్యేకత ఏంటి అనే అనుమానం చాలా మందిలో ఉంది.

కీళడి అనేది తమిళనాడులోని ఓ పురావస్తు ప్రదేశం. ఇది శివగంగై జిల్లాలోని వైగై నది ఒడ్డున ఉన్న చారిత్రక గ్రామం. ఇక్కడ జరిపిన తవ్వకాలలో తమిళ సంస్కృతి, నాగ‌రిక‌త‌కు సంబంధించి కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆర్కియాల‌జిక‌ల్ డిపార్ట్మెంట్ 2015 నుండి ఇక్క‌డ త‌వ్వ‌కాలు జ‌రుపుతుండ‌గా ఒక అభివృద్ధి చెందిన శ‌హ‌రీ నాగ‌రికత ఉనికిని గుర్తించారు. ఈ నాగ‌రిక‌త క్రీ.పూ 6వ శ‌తాబ్దం నుండి క్రీ.శ 3వ శ‌తాబ్దం నాటిది అని గుర్తించారు. అంటే త‌మిళ సంస్కృతిని హ‌ర‌ప్పా నాగ‌రిక‌త‌తో స‌మానమైన‌ద‌ని చెప్ప‌వ‌చ్చు.

శ‌హ‌రీ నాగ‌రిక‌త‌లో కుండ‌లు, నీటి వ్య‌వ‌స్థ‌లు, అనేక క‌ట్ట‌డాలు సుసంప‌న్న‌మైన స‌మాజాన్ని సూచిస్తున్నాయి. అంతే కాకుండా త‌మిళ బ్ర‌హ్మీలిపిలో రాసిన శాస‌నాలు సైతం ఇక్క‌డ లభించాయి. త‌మిళ భాష లిఖిత రూపం ఈ త‌వ్వ‌కాల్లో బ‌య‌ట‌ప‌డింది. ద‌క్షిణ భార‌త‌దేశంలో ఆనాటి నుండే అక్ష‌రాస్య‌త ఉంద‌ని ఇక్క‌డ ల‌భించిన శాస‌నాల ద్వారా రుజువైంది. దీంతో కీళ‌డి త‌వ్వ‌కాలు త‌మిళ సంస్కృతి, నాగ‌రిక‌త గొప్ప‌త‌నాన్ని ప్ర‌పంచానికి తెలియ‌జేశాయ‌ని ఆ రాష్ట్రంలోని అధికార డీఎంకే ఎక్కువ‌గా దీనిపై ప్ర‌చారం చేస్తోంది. కీలడి తవ్వకాలకు సంబంధించిన నివేధికలు విడుదల చేయాలని డీఎంకే కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. ఉత్తర భారత దేశ చరిత్రనే గొప్పగా చూపించాలని కేంద్రంలోని బీజేపీ భావిస్తోందని డీఎంకే విమర్శలు కురిపిస్తోంది.

Next Story