South Korea: మిలిటరీ కసరత్తుల్లో అపశ్రుతి.. సొంత పౌరులపై బాంబులు

by Yella Dhawani Reddy |

దక్షిణ కొరియా (South Korea) గురువారం చేపట్టిన మిలిటరీ శిక్షణలో (Military Drill Excercise) అపశ్రుతి చోటు చేసుకుంది.

South Korea: మిలిటరీ కసరత్తుల్లో అపశ్రుతి.. సొంత పౌరులపై బాంబులు
X

దిశ, వెబ్ డెస్క్: దక్షిణ కొరియా (South Korea) గురువారం చేపట్టిన మిలిటరీ శిక్షణలో (Military Drill Excercise) అపశ్రుతి చోటు చేసుకుంది. పోచియాన్‌(Pocheon)లో సైన్యం-వైమానిక దళం సంయుక్తంగా శిక్షణ కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో యుద్ధ విమానం ప్రమాదవశాత్తూ సొంత పౌరులపైనే బాంబులను జారవిడిచింది. ఈ ప్రమాదంలో పలువురు సామాన్య పౌరులు చనిపోగా, మరికొంత మంది గాయపడ్డారు. అయితే, ఈ దాడి పొరపాటున జరిగిందని వివరణ ఇస్తూ.. దేశ పౌరులను సైన్యం క్షమాపణలు కోరింది.

కేఎఫ్‌-16 విమానం నిర్దేశించిన ఫైరింగ్ రేంజ్‌లో కాకుండా వేరే ప్రదేశంలో ఎంకే-82 బాంబులను జార విడిచింది. దీంతో జనావాసాలపైకి విమానం దూసుకెళ్లి.. 8 బాంబులు వేసింది. దీంతో సామాన్య పౌరులు చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడగా.. వారిని చికిత్స కోసం వాళ్లను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సైన్యం పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రకటన విడుదల చేసింది. అలాగే బాధితులకు పరిహారం అందజేస్తామని తెలిపింది. ఘటనపై దర్యాప్తు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. కాగా, త్వరలో అమెరికా-దక్షిణ కొరియా సైన్యాల సంయుక్త ప్రదర్శన జరగాల్సి ఉంది. ఇందుకోసం గురువారం నుంచి పోచియాన్‌లో ఇరు దేశాల సైన్యాలు ప్రాక్టీస్‌ చేపట్టాయి.

Next Story