కింగ్ కు నో చాన్స్.. కనీసం కింగ్ మేకర్ అయ్యేనా?.. ఎగ్జిట్ ఫలితాల్లో విజయ్ పార్టీకి ఊహించని షాక్!

by Prasad Jukanti |   (  Updated:2026-04-29 15:07:16  IST  )

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. సినిమా రంగాన్ని కాదని రాజకీయ రంగంలో అడుగు పెట్టి తమిళనాడు రాజకీయాలను శాసించాలనుకున్న విజయ్ టీవీకే పార్టీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కింగ్ కు నో చాన్స్.. కనీసం కింగ్ మేకర్ అయ్యేనా?.. ఎగ్జిట్ ఫలితాల్లో విజయ్ పార్టీకి ఊహించని షాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో:భారతదేశ ఫ్యూచర్ రాజకీయాలకు కీలక మలుపుగా భావిస్తున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ మరియు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ ఎన్నికల ఫలితాలపై ఓటర్ల నాడిని ప్రతిబింబించే 'ఎగ్జిట్ పోల్' (Exit Polls 2026) అంచనాలు ఈ సాయంత్రం రిలీజ్ అయ్యాయి. దేశవ్యాప్తంగా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పశ్చిమబెంగాల్‍లో (West Bengal) బీజేపీ, తమిళనాడులో (Tamil Nadu) డీఎంకే అధికారంలోకి రాబోతున్నట్లు మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. కేరళలో UDF, అసోంలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి అధికారం దక్కించుకోబోతున్నట్లు అంచనా వేశాయి.

మూడో స్థానంలో టీవీకే:

సినీ రంగంలో నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన అధికారంలోకి రాబోతున్నామని ప్రకటించిన టీవీకే అధినేత విజయ్ కు తమిళనాడు ఓటర్లు తీవ్ర విరాశనకు గురి చేసినట్లు ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ డీఎంకే అధికారంలోకి రాబోతుండగా ఏడీఎంకే రెండో స్థానంలో, విజయ్ పార్టీ టీవీకే మూడో స్థానానికి పరిమితం కాబోతున్నట్లు అంచనా వేశాయి. మ్యాట్రిజ్ సంస్థ సర్వే ప్రకారం టీఎంకే 122-132 స్థానాలు, ఏడీఎంకే 87-100 స్థానాలు, టీవీకే 10-12 స్థానాలు, ఇతరులు 0-6 స్థానాలు గెలవబోతున్నట్లు అంచనా వేసింది. ఇక పీపుల్స్ పల్స్ సంస్థ డీఎంకే 125-145, ఏడీఎంకే 65-80, టీవీకే 18-24, ఇతరులు 2-6 స్థానాలు గెలవబోతున్నట్లు లెక్కకట్టింది. దీంతో సినీ కెరీర్ లో రారాజుగా వెలుగొందిన తలపతి.. పొలిటికల్ కెరీర్ లో మాత్రం ఆశించిన రిజల్ట్ రాబట్టుకోలేకపోయారనే చర్చ జరుగుతోంది. మరి ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఎగ్జాట్ రిజల్ట్ గా మారుతాయా? లేక విజయ్ పార్టీ కింగ్ కాకపోయినా కింగ్ మేకర్‍గా నిలుస్తుందా అనేది వేచి చూడాలి.

ముగిసిన పోలింగ్ మే 4న కౌటింగ్:

ఇవాళ పశ్చిమబెంగాల్ లో రెండో విడత పోలింగ్ ముగిసింది. 142 సీట్లకు రెండో దశ కింద ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరింది. 6 గంటల తర్వాత క్యూలైన్లలో ఉన్నవారినే ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇస్తున్నారు. బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు 6 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గత మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 9న కేరళ, అసోం, పుదుచ్చేరి శాసనసభలకు పోలిగ్ నిర్వహించగా తమిళనాడులో ఒకే విడతలో ఏప్రిల్ 23న, పశ్చిమబెంగాల్‍లో మొదటి విడత ఏప్రిల్ 23న, రెండో విడత ఏప్రిల్ 29న పోలింగ్ నిర్వహించింది. ఈ ఓట్లను మే 4వ తేదీన లెక్కించనున్నారు.

Next Story