బీజేపీ చేతికి ఆయుధమిచ్చిన ఉదయనిధి స్టాలిన్.. ఇండియా కూటమిలో మొదలైన చిచ్చు..!

by Disha Web Desk 19 |
బీజేపీ చేతికి ఆయుధమిచ్చిన ఉదయనిధి స్టాలిన్.. ఇండియా కూటమిలో మొదలైన చిచ్చు..!
X

దిశ, వెబ్‌డెస్క్: తమినాడు సీఎం స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ హిందూ సనాతన ధర్మంపై చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా చిచ్చురేపుతున్నాయి. సనాతన ధర్మాన్ని ఉదయనిధి స్టాలిన్ మలేరియా డెంగ్యూ, ప్రాణాంతక కరోనాతో పోల్చడంతో హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. హిందు సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాలని చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు వ్యతిరేకంగా హిందూ సంఘాలు, బీజేపీ నేతలు నిరసనలు చేస్తున్నారు. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉదయనిధి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇలా మంత్రి ఉదయనిధి కామెంట్స్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సారి ఎలాగైనా కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో దేశంలోని వివిధ ప్రతిపక్ష పార్టీలు ఒక్కటయ్యాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి.

ఈ కూటమికి ప్రతిపక్ష పార్టీలు ఇండియా అని నామకరణం చేశాయి. ఈ కూటమిలో కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఆప్, ఇతర పార్టీలు భాగస్వామ్యులుగా ఉన్నాయి. అయితే, సనాతన ధర్మంపై తాజాగా మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమిలో చిచ్చురేపాయి. కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకే పార్టీ నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఇండియా కూటమిలో బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమిలోని తృణమాల్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది.

టీఎంసీ పార్టీ జనరల్ సెక్రటరీ కునాల్ ఘోష్ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆల్ ఇండియా తృణమాల్ కాంగ్రెస్ పార్టీ అన్ని ధర్మాలను సమానంగా చూస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తాను సనాతన ధర్మం సంస్థలో ఉపాధ్యక్షుడిని అని.. హిందూ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఉదయనిధి స్టాలిన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై ఇండియా కూటమిలో చిచ్చు రేపుతున్నాయి. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ఇండియా కూటమిలో బిన్నభిప్రాయాలు వ్యక్తం కావడంతో పాటు ఎన్నికల వేళ బీజేపీకి ఆయుధం అందించినట్లు ఉందని పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.

Next Story

Most Viewed