Deasel Prices Increase : కర్ణాటకలో భారీగా పెరిగిన డీజిల్ ధరలు

by Muthe.Rajitha |

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం(Karnataka Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Deasel Prices Increase : కర్ణాటకలో భారీగా పెరిగిన డీజిల్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం(Karnataka Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో డీజిల్ ధరలు భారీగా పెంచుతూ(Deasel Prices Increase ) వినియోగదారుల నెత్తిన పిడుగు వేసింది. ఏప్రిల్ 1, 2025 నుంచి లీటర్ పై రూ.2 పెంచుతున్నట్టు నోటిఫికేషన్ జారీ చేసింది. డీజిల్‌పై అమ్మకపు పన్ను కర్ణాటక సేల్స్ టాక్స్ (KST)ని 3 శాతం పెంచినట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో డీజిల్‌పై అమ్మకపు పన్ను 18.4 శాతం నుండి 21.17 శాతానికి పెంచారు. ఈ ధరల పెరుగుదల రవాణా రంగంపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. కర్ణాటకలో ఎక్కువగా వాణిజ్య వాహనాలు డీజిల్‌పై ఆధారపడతాయి కాబట్టి, రవాణా ఖర్చులు పెరగడం వల్ల వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

ఇది సామాన్య ప్రజలపై అదనపు భారం పడేలా చేయవచ్చునని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక వనరులను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్న కర్ణాటక ప్రభుత్వం.. ఈ పన్ను పెంపు ద్వారా సుమారు రూ. 2,000 కోట్ల అదనపు ఆదాయం సమీకూరనుందని అంచనా వేసింది. గత మూడు రోజుల క్రితమే పాల ధరలను రూ.4 పెంచిన కర్ణాటక సర్కార్.. ఇపుడు డీజిల్ ధరలు కూడా పెంచడంతో సామాన్యుడు, చిరు వ్యాపారులు కుదెలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Next Story