పలాష్ చీట్ చేశాడా? అందుకే స్మృతి మంధాన పెళ్లి రద్దయిందా?

by Phanindra |   (  Updated:2025-11-25 19:03:45  IST  )

స్మృతి మంధానతో రిలేషన్‌లో ఉన్నప్పుడే పలాష్ చీట్ చేశాడా? అందుకే స్మృతి పెళ్లి రద్దయిందా?

పలాష్ చీట్ చేశాడా? అందుకే స్మృతి మంధాన పెళ్లి రద్దయిందా?
X

దిశ, స్పోర్ట్స్: అన్నీ సవ్యంగా జరిగుంటే.. ఈ వారంలో టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లయిపోయి ఉండేది. ఫిలింమేకర్-కంపోజర్ పలాష్ ముచ్చల్‌తో కలిసి ఒక ఇంటిదయ్యేదామె. కానీ ఆమె తండ్రి అనారోగ్యం పాలవడం, ఆ తర్వాత పలాష్ కూడా అస్వస్థతకు గురవడంతో పండగలా జరగాల్సిన వేడుక అర్ధంతరంగా ఆగిపోయింది. ఇలాంటి సమయంలో తన ఎంగేజ్‌మెంట్, పలాష్ తనకు ప్రపోజ్ చేసిన వీడియో వంటి పోస్టులను స్మృతి తన ఇన్‌స్టా ఖాతా నుంచి తొలగించింది. పలాష్ కూడా కొన్ని పోస్టులు తొలగించినట్లు తెలుస్తోంది. వీళ్లు ఇలా ఎందుకు చేశారు? పెళ్లి వాయిదా పడిందా? లేక పూర్తిగా ఆగిపోయిందా? అని అభిమానులు ఆలోచిస్తుండగానే.. పలాష్ ఈ రిలేషన్‌లో చీట్ చేశాడంటూ కథనాలు వస్తున్నాయి.

అతను ఒక అమ్మాయితో చేసిన చాట్ అంటూ కొన్ని స్క్రీన్ షాట్లను ఒక యువతి ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. అవి చూసిన అందరూ షాకయ్యారు. ఇది జరిగిన తర్వాతనే స్మృతి తన సోషల్ మీడియా నుంచి ఈ పోస్టులు, వీడియోలు తొలగించిందని కొందరు అంటున్నారు. అసలు ఈ విషయం తెలియడం వల్లనే స్మృతి తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చి ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇన్‌స్టాలో మేరీ డి‘కోస్టా అనే యూజర్.. ఈ చాట్ స్క్రీన్ షాట్స్‌ను షేర్ చేసింది. పలాష్‌ను ఉద్దేశిస్తూ.. తను వ్యక్తిగతంగా అతన్ని కలవలేదని ఆ తర్వాత ఆమె క్లారిటీ ఇచ్చింది.

అయితే ఒక యువతితో చేసిన చాట్స్‌లో.. స్మృతి ఎక్కువగా టూర్స్‌లో ఉండటంతో తను ఒంటరిగా ఉంటున్నానని, గతంలో ఆమెతోపాటు తను కూడా టూర్స్‌కు వెళ్లేవాడినని, అయితే ఇప్పుడు బిజీగా ఉండటంతో దూరం పెరిగిందని పలాష్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇవి అసలు నిజంగా పలాష్ చేసిన చాట్సేనా? వీటి వల్లనే ఈ పెళ్లి ఆగిపోయిందా? అనే విషయాలపై ఎలాంటి క్లారిటీ లేదు. పెళ్లి ఆగిపోయిన తర్వాత స్మృతి కుటుంబం నుంచి, పలాష్ కుటుంబం నుంచి ఈ విషయంపై ఎలాంటి ప్రకటన కూడా రాలేదు. కాగా, అస్వస్థతకు గురైన పలాష్‌ను ముంబైలోని ఆస్పత్రికి తరలించినట్లు అతని తల్లి వెల్లడించారు.

Next Story