- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Manipur: మణిపూర్ హింస.. ఫోరెన్సిక్ నివేదిక కోరిన సుప్రీం కోర్టు
మణిపూర్(Manipur) లో హింసను ప్రేరేపించండలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్(Manipur Chief Minister N Biren Singh) ప్రమేయం ఉందని వచ్చిన ఆరోపణలను సుప్రీం కోర్టు సీరియస్ గా తీసుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్(Manipur) లో హింసను ప్రేరేపించండలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్(Manipur Chief Minister N Biren Singh) ప్రమేయం ఉందని వచ్చిన ఆరోపణలను సుప్రీం కోర్టు సీరియస్ గా తీసుకుంది. లీకైన సీఎం ఆడియో క్లిప్ కు సంబంధించిన ప్రభుత్వ ఫోరెన్సిక్ రిపోర్టును అందించాలని ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది. మణిపూర్ లో రెండు జాతుల మధ్య జరిగిన హింసను సీఎం ప్రేరేపించారని ఆరోపిస్తూ.. కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్టు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఆడియో క్లిప్‌లను దేశంలోని స్వతంత్ర ఫోరెన్సిక్ ల్యాబ్ అయిన ‘ట్రూత్ ల్యాబ్స్’ పరిశీలించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. అందులోని వాయిస్.. సీఎం గొంతుతో 93 శాతం మ్యాచ్ అయినట్లు తేల్చిందన్నారు. ఈ వాదనలు విన్న తర్వాత ఈ ఆడియోలకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను అందించాలంటూ సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ ఫోరెన్సిక్ లాబొరేటరీ సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణను మార్చి 24కు వాయిదా వేసింది. అయితే, రెండు జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నరకాలంగా మణిపూర్ అట్టుడుకుతోంది. మణిపూర్ లో చెలరేగిన హింస వల్ల ఇప్పటివరకు 250 మంది చనిపోయారు. శాంతిభద్రతలు సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలోనే సీఎంపై ఆరోపణలు రావడం గమనార్హం.






