Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా గ్యాడ్జెట్లలో 12టెరా బైట్ల డేటా..!

by Shamantha N |   (  Updated:2025-05-27 13:33:41  IST  )

గూఢచర్యం (spying) కేసులో అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) గురించి రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది.

Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా గ్యాడ్జెట్లలో 12టెరా బైట్ల డేటా..!
X

దిశ, నేషనల్ బ్యూరో: గూఢచర్యం (spying) కేసులో అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) గురించి రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. అయితే, ఇప్పటికే ఆమె ఫోన్లు, ల్యాప్ టాప్ ను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, అందులో డిలీట్ అయిన సమాచారాన్ని అధికారులు రికవరీ చేస్తున్నారు. దాదాపు 12 టెరా బైట్ల డేటాను రికవరి చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘జ్యోతి మల్హోత్రాకు చెందిన మూడు ఫోన్ల నుంచి 12 టెరా బైట్ల డేటాను స్వాధీనం చేసుకున్నాం. రికవరీ చేసిన డిజిటల్‌ డేటాను పరిశీలిస్తున్నాం. ఆమె ల్యాప్‌టాప్‌లోని డేటాను ఇంకా పరిశీలించాల్సి ఉంది’ అని సీనియర్‌ పోలీసు అధికారి వెల్లడించినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతేకాకుండా, జ్యోతి మల్హోత్రా నలుగురు పాకిస్థానీ నిఘా ఏజెంట్లతో నేరుగా సంప్రదింపులు జరిపినట్లు కూడా తేలింది. వీరిలో ఢిల్లీలోని పాక్‌ హైకమిషన్‌ను సందర్శించినప్పుడు పరిచయమైన డానిష్‌, అహ్సాన్‌, షాహిద్‌ ఉన్నారు. దీంతో పాక్‌ భద్రతా సంస్థలో వీరి పాత్ర గురించి అధికారులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కీలక విషయాలు..

ఇదిలా ఉండగా.. దర్యాప్తులో భాగంగా పాక్‌ కోసం గూఢచర్యం చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్థాన్‌ పర్యటనలో అక్కడి అధికారులు ఆమెకు పూర్తిగా సహకరించినట్లు తెలుస్తోంది. లాహోర్‌లోని అనార్కలీ బజార్‌ని సందర్శించిన సమయంలో ఆమెకు ఏకంగా ఆరుగురు గన్‌మెన్లు ఏకే 47తో భద్రత కల్పించినట్లుగా తేలింది. స్కాట్లాండ్‌కు చెందిన ఓ యూట్యూబర్‌ వీడియోతో ఈ విషయం బయటపిండి.జ్యోతికి కల్పించిన సెక్యూరిటీని చూసి స్కాట్లాండ్ యూట్యూబర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక, 2023లో వీసా కోసం పాక్‌ హైకమిషన్‌కు వెళ్లిన సమయంలో తొలిసారి డానిష్‌ పరిచయం అయ్యాడని అధికారులు వెల్లడించారు. పాక్‌ హైకమిషన్‌ కార్యాలయానికి వీసా కోసం వచ్చే వారిని ట్రాప్‌ చేసి వారిని డానిష్‌ గూఢచర్యానికి వాడుకొనేవాడని.. యూట్యూబర్‌ జ్యోతి కూడా వీసా కోసం వెళ్లగా ఆమెను ట్రాప్‌ చేశాడని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు పోలీస్‌ రిమాండ్‌లో ఉన్న జ్యోతిని కోర్టు సోమవారం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది.

Next Story