- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gujarat: సూరత్‌లో రూ. 25 కోట్ల విలువైన వజ్రాల చోరీ
గుర్తు తెలియని వ్యక్తులు ఈ విలువైన రత్నాలను దొంగలించినట్టు పోలీసులకు సోమవారం ఫిర్యాదు అందింది.

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్ రాష్ట్రంలో భారీ వజ్రాల చోటీ ఘటన చోటుచేసుకుంది. సూరత్‌లోని డీకే అండ్ సన్స్ కంపెనీలో దాదాపు రూ. 25 కోట్ల విలువైన విజ్రాలను దొంగలు దోచుకెళ్లారు. కంపెనీకి చెందిన పాలిషింగ్, ఎగుమతి యూనిట్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఈ విలువైన రత్నాలను దొంగలించినట్టు పోలీసులకు సోమవారం ఫిర్యాదు అందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్‌లో ఉన్న కపొద్రాలో డీకే అండ్ సన్స్ పాలిషింగ్ యూనిట్‌లో ఈ దొంగతనం జరిగింది. గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించి మెటల్ సేఫ్ తెరిచారని, సీసీటీవీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ 1) అలోక్ కుమార్ తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం, కృష్ణాష్టమి వేడుకల దృష్ట్యా కంపెనీ మూడు రోజుల సెలవు ప్రకటించింది. అందువల్ల ఉద్యోగులు, సెక్యూరిటీ గార్డులు యూనిట్‌లో లేని సందర్భాన్ని ఆసరాగా చేసుకుని, దొంగలు కంపెనీ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఆఫీస్ ప్రధాన తలుపును పగలగొట్టి, ఆపై మెటల్ సేఫ్ ఉంచిన మూడవ అంతస్తులోకి వెళ్లారు. ఆ తర్వాత గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించి సేఫ్‌ను కత్తిరించారని అలోక్ కుమార్ వివరించారు. సెలవుల తర్వాత కంపెనీ యజమాని ఆఫీసుకు వెళ్లి చూడగా, దొంగతనం జరిగినట్టు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు వెల్లడించారు.






