Dhananjay: సర్పంచ్ హత్య కేసు.. మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా

by B.Srinivas |

మహారాష్ట్రలోని బీడ్‌లో జరిగిన సర్పంచ్ దేశ్ ముఖ్ హత్య కేసుపై తీవ్ర వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

Dhananjay: సర్పంచ్ హత్య కేసు.. మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని బీడ్‌లో జరిగిన సర్పంచ్ దేశ్ ముఖ్ (Deshmukh) హత్య కేసుపై తీవ్ర వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఘటన అనంతరం రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఈ హత్యలో మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన దనుంజయ్ ముండే (Danunjay munde) సన్నిహితుడు వాల్మీకి కరాడ్ (Valmiki karad) ప్రమేయం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై దర్యాప్తు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) సైతం కరాడ్‌ను ప్రధాన సూత్రధారిగా అభివర్ణించింది. ఈ నేపథ్యంలో మినిస్టర్ ధనుంజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రి పదవికి మంగళవారం రిజైన్ చేశారు. ఈ మేరకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు రాజీనామా లేఖను అందజేశారు.

అయితే ఆరోగ్య కారణాల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ధనుంజయ్ తెలిపారు. ‘బీడ్ జిల్లాలో సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసులో నిందితులకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలి. ఘటన జరిగినప్పటి నుంచి ఈ డిమాండ్ చేస్తున్నా. హత్యపై సోషల్ మీడియాలో వైరలైన ఫొటోలను చూసి నేను ఎంతో బాధపడ్డా. ఈ కేసులో దర్యాప్తు పూర్తై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. త్వరలోనే దోషులకు శిక్ష పడాలి. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగాలేదు. అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మంత్రి పదవి నుంచి ముండేను తొలగించినట్టు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadmavis) సైతం ప్రకటించారు.

Next Story