తమిళనాడు తొక్కిసలాట ఘటనపై స్పందించిన డీజీపీ

by Malleboina Mahesh |   (  Updated:2025-09-28 03:05:27  IST  )

తమిళ సూపర్ స్టార్ విజయ్ తన పార్టీ టీవీకే రాజకీయ సభలో భాగంగా కరూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో తొక్కిసలాట జరిగి 39 మంది ప్రాణాలు కోల్పోయారు.

తమిళనాడు తొక్కిసలాట ఘటనపై స్పందించిన డీజీపీ
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ (Vijay) వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడులోని కరూర్‌లో నిన్న(శనివారం) మధ్యాహ్నం స్ట్రీట్ కార్నర్ మీటింగ్ (Street corner meeting) కు విజయ్ పర్మిషన్ తీసుకున్నారు. పోలీసులు కూడా దాదాపు 10 మందికి అనుమతించగా.. హీరో విజయ్ రాత్రి 7 గంటలకు మీటింగ్ కు వచ్చాడు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతుండగా ఒక్కసారిగా తొక్కిసలాట (Stampede) జరిగి 39 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 83 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో విజయ్ కార్నర్ మీటింగ్ కాస్తా.. మృత్యు మీటింగ్ గా మారిపోయింది. అయితే ఈ విషాద ఘటనపై తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Govt.) హీరో విజయ్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో దారుణ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు డీజీపీ (TamilNadu DGP) స్పందించారు. తొక్కిసలాట ఘటనలో పోలీసుల వైఫల్యం లేదని, తాము 10 వేల మంది హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చామని, కరూర్‌ సభకు దాదాపు 27 వేల మంది వచ్చారని DGP వెంకటరామన్ గుర్తు చేశారు. అలాగే మధ్యాహ్నం ఒంటి గంటకు రావాల్సిన విజయ్ సా.7 గంటలకు వచ్చారని, ఒక్కసారిగా జనం పెరగడంతోనే తొక్కిసలాట జరిగిందని DGP వెంకటరామన్ మీడియాతో చెప్పుకొచ్చారు. కాగా ఈ విషాద సంఘటనపై వెంటనే స్పందించిన తమిళనాడు సీఎం స్టాలిన్.. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని స్థానిక అధికారులు, వైద్య సిబ్బందికి సూచించారు. అలాగే ఈ ఘటనపై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని CM ఆదేశించారు. ఈ ఏక సభ్య కమిషన్‌కు అరుణ జగదీషన్ నాయకత్వం వహించనున్నారు.

Read More: "నా హృదయం ముక్కలైంది.. ఆ బాధను వర్ణించలేను" : తొక్కిసలాట ఘటనపై విజయ్ ఫస్ట్ రియాక్షన్

Next Story