- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈరోజుల్లో దేన్నైనా సృష్టించవచ్చు : వైరల్ వీడియోలపై డీజీపీ సంచలన కామెంట్స్
కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ అధికారి.. డీజీపీ రామచంద్రరావు ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలోనే యువతులతో అశ్లీల కార్యకలాపాలకు పాల్పడిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ అధికారి.. డీజీపీ రామచంద్రరావు ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలోనే యువతులతో అశ్లీల కార్యకలాపాలకు పాల్పడిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డీజీపీ ర్యాంక్ అధికారిగా ఉండి.. ఇవేం పాడుపనులంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. డీజీపీ రాసలీలల సీఎం సిద్ధరామయ్య దృష్టికి చేరడంతో ఆయన వీడియోలపై విచారణకు ఆదేశించారు. దీనిపై లోతైన విచారణ జరగాల్సి ఉందని, వీడియోలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.
ఈ రోజుల్లో దేన్నైనా సృష్టించవచ్చు
డీజీపీ ఆఫీసులోనే యువతులతో ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయిన వ్యవహారంపై మీడియా రామచంద్రరావును ప్రశ్నించగా.. ఆ వీడియోలు తనవి కాదని వాపోయారు. వీడియోలు వైరల్ కావడంతో మీడియా ముందుకు వచ్చిన ఆయన.. ఈ వీడియోల వెనుక ఏదో కుట్ర జరిగిందని, ఏఐతో తాను అశ్లీలంగా ప్రవర్తించిన వీడియోలను సృష్టించి ఎవరో కావాలనే సోషల్ మీడియాలో లీక్ చేశారని చెప్పారు. ఈ కాలంలో ఉన్న టెక్నాలజీతో దేన్నైనా సృష్టించవచ్చని, వైరల్ వీడియోలపై హోంశాఖకు వివరణ ఇచ్చానని తెలిపారు.
అప్పుడు కూతురు.. ఇప్పుడు తండ్రి
ఈ క్రమంలో ఏఐ వీడియోలని ఎలా చెప్తారు? అందులో క్లియర్ గా కనిపిస్తోందని మీడియా గట్టిగా ప్రశ్నించడంతో.. సమాధానం దాటవేశారు. గతేడాది మార్చిలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన నటి రన్యారావు తండ్రే ఈ డీజీపీ రామచంద్రరావు. అప్పుడు కూతురు గోల్డ్ స్మగ్లింగ్.. ఇప్పుడు తండ్రి అమ్మాయిలతో రాసలీలలు చేస్తూ.. ఇలా పట్టుబడ్డారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.






