Dgmos: రేపు భారత్ పాక్ చర్చలు.. కాల్పుల విరమణపైనే ఫోకస్ !

by B.Srinivas |

భారత్ పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ ఇరు దేశాల మధ్య ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.

Dgmos: రేపు భారత్ పాక్ చర్చలు.. కాల్పుల విరమణపైనే ఫోకస్ !
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ పాకిస్థాన్ (India pakisthan) మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ ఇరు దేశాల మధ్య ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రెండు దేశాల డైరెక్టర్ జనరల్ ఆప్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ)ల సమావేశం సోమవారం జరగనుంది. మద్యాహ్నం 12 గంటలకు ఈ చర్చలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. భారత్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ దీనిని ధ్రువీకరించారు. అయితే సమావేశం ఎక్కడ జరుగుతుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, సీజ్ ఫైర్ ఒప్పందం, సరిహద్దుల్లో కాల్పులు సహా వివిధ అంశాలపై డీజీఎంలోలు చర్చించనున్నట్టు సమాచారం. అంతేగాక రెండు దేశాల మధ్య శాంతి యుత వాతావరణం నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా డిస్కస్ చేయనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

డీజీఎంఓల మధ్య జరగనున్న చర్చలు ప్రధానంగా కాల్పుల విరమణ అంశాలపైనే ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఉద్రిక్తతల తీవ్రతను తగ్గించడంపైనా దృష్టి సారించనున్నట్టు పలువురు భావిస్తున్నారు. గతంలో కాల్పుల విరమణ ఉన్నప్పటికీ సరిహద్దుల్లో పాక్ సీజ్ ఫైర్ ఉల్లంఘిస్తోందని భారత్ పదే పదే ఆందోళన వ్యక్తం చేసింది. అంతేగాత తాజా ఒప్పందం జరిగిన గంటల వ్యవధిలోనే మళ్లీ ఉల్లంఘించింది. దీంతో కాల్పుల విరమణపై సమాధానం తర్వాతనే మిగతా అంశాలపై చర్చించే అవకాశం ఉందని, ఈ అంశంపై తీవ్రంగా చర్చ జరగనున్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే డీజీఎంఓల భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతకుముందు మే 10న డీజీఎంఓలు పలు అంశాలపై చర్చలు జరిపారు.

Next Story